Heart Attack Main Reason home remedies

గుండెపోటుకు ప్రధాన కారణం ఇదే

ప్రపంచ దేశాలలో గుండెపోటు ఎక్కువగా వచ్చే దేశం భారతదేశం. ఎందుకంటే మన దేశంలో ఉప్పు వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే దేశాలలో ఉప్పు ఉడికించిన ఆహారం పై చల్లుకొని తింటారు. కానీ మనదేశంలో ఉప్పు ఎక్కువగా వేసి వండిన ఆహారాన్ని మాత్రమే తింటారు. అంతేకాకుండా వేరే దేశాలలో ఎక్కువగా సలాడ్స్, సగం ఉడికించిన కూరగాయలు ఎక్కువగా తింటారు. పండ్లను ఎక్కువగా తినడం ఎండు విత్తనాలు పండ్ల రసాలు ఎక్కువగా వారి ఆహారంలో ఉంటాయి. ఇలా తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

 గుండెపోటు రాకుండా ఉండాలంటే ఉడికిన ఫుడ్స్ 50 శాతం తగ్గించుకుని 50%నాచురల్ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. కానీ మనదేశంలో జంక్ ఫుడ్ , ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలు, నిల్వ చేసే పదార్థాలు, ఉప్పు అధికంగా ఉండే పచ్చళ్ళు  ఎక్కువగా తినడం వలన శరీరంలో కొవ్వు పేరుకొని అధిక బరువు, రక్తపోటు సమస్య అధికంగా ఉంటుంది. ఇలా అధిక బరువు, రక్తపోటుతో బాధపడే వారు గుండె జబ్బులకు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

అందుకే ఆహారంలో ఉప్పు, నూనె వాడకం తగ్గించాలి. ఇప్పటి రోజుల్లో ఒక కుటుంబం నెలకు ఆరేడు కేజీల నూనెను సులవుగా ఉపయోగిస్తున్నారు.

ఇలా అతిగా నూనె ఉపయోగించడం వలన చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం లేకుండా చేస్తుంది. దీని వలన ఇది రక్తనాళాల్లో పేరుకుని రక్తప్రవాహాన్ని అడ్డుకొని, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే సాధ్యమైనంత ఆహారపు అలవాట్లను మార్చుకుని వ్యాయామాన్ని రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం వలన అధిక బరువు సమస్యను అధిగమిస్తూ గుండెపోటు ప్రమాదం రాకుండా జాగ్రత్త పడవచ్చు. 

చిన్న వయసు నుండి ఈ జాగ్రత్తలు పాటించడం వలన జీవిత ప్రమాణాలు పెంచుకోవచ్చు. అంతేకాకుండా చిన్న వయస్సులో గుండెపోటు వచ్చే ప్రధాన ప్రమాద కారకాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని దూరంగా పెట్టి  గుండెపోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు. జంక్ ఫుడ్ లేదా అధిక మద్యం వాడకం, ధూమపానం, అధిక రక్త పోటు, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, శారీరక శ్రమ లేకపోవడం, మధుమేహం, పోషకాహార లేమి ఉన్నా కూడా గుండెనొప్పి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని గమనిస్తూ మంచి పోషకాహారం, వ్యాయామం అలవాటుగా మార్చుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!