heart touching real story in telugu

కన్నీరు కారుస్తూ ఆంబులెన్స్ నడిపిన డ్రైవర్ ఎందుకు నిజం తెలిసి దేశమంతా షాక్

45 రోజుల పసిబిడ్డను కాపాడడానికి  అంబులెన్స్ డ్రైవర్ చేసిన ప్రయత్నం. నాలుగు గంటల సమయం 350 రెండు కిలోమీటర్ల దూరం మధ్యలో ట్రాఫిక్ వీటన్నిటిని చూసి వెనుకంజ వేయకుండా ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ డ్రైవర్. సాహసంతో కదిలాడు కళ్ళు చెదిరే వేగంతో గమ్యస్థానాన్ని చేరుకున్నారు.  గంటకి వంద కిలోమీటర్లు తగ్గకుండా   గమ్యస్థానాన్ని సమయానికి చేర్చాడు.  మంగళూరుకు చెందిన 40 రోజుల పసికందు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. 

       ఈ బిడ్డను కాపాడేందుకు డాక్టర్లు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని చెప్పారు. దీనికోసం బిడ్డ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సమయంలో డాక్టర్లు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. బెంగుళూరులో ఒక మహిళ  చనిపోతే ఆమె  బంధువులు గుండె దానం చేసేందుకు ముందుకు వచ్చారని ఆ గుండె మీ బిడ్డకు సరిపోతుందని తెలియజేశారు. కానీ  ఆపరేషన్ బెంగళూరులో చేయాల్సి ఉంది. గుండె ను బయటకు తీసిన తర్వాత నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది. నాలుగు గంటల లోపు ఆపరేషన్ చేయకపోతే ఇంకా గుండె పని చేయదు.

        మంగళూరు నుండి బెంగళూరు కి వెళ్లడానికి 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనిని చేరుకోవాలంటే  8 గంటల సమయం పడుతుంది. అందుకు  బిడ్డ తల్లిదండ్రులు విమానంలో తీసుకెళ్లేందుకు డాక్టర్లను సహాయక డాక్టర్లు ఆకాశం లోకి వెళ్లే కొద్దీ  ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి బిడ్డకు విమానంలో ఇప్పుడు ప్రయాణం చేయడం అంత మంచిది కాదని చెప్పడంతో రోడ్డు మార్గం ద్వారానే తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ బిడ్డకు నాలుగు గంటల లోపు ఆపరేషన్ చేయాల్సిందే లేదంటే ప్రాణాలు  దక్కవని డాక్టర్లు చెప్పారు.

      గంటల సమయంలో మంగళూరు నుంచి బెంగళూరుకు చేర్చడం కోసం బిడ్డ తల్లిదండ్రులు అంబులెన్స్ డ్రైవర్ ల కోసం చాలా ప్రయత్నించారు. కానీ సాహసం చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఒక డ్రైవర్ మాత్రం నాలుగు గంటల్లో మంగళూరు నుంచి బెంగళూరు తీసుకెళ్లడానికి ముందుకొచ్చాడు.  అంబులెన్స్ డ్రైవర్ అతనికి తెలిసిన వాళ్ల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా మంగళూరు నుంచి బెంగళూరు వరకు ట్రాఫిక్ క్లియర్  చేసి ఆంబులెన్స్ కు దారి  ఇచ్చే లాగా ముందు నుంచి ట్రాఫిక్ పోలీసులు మరియు స్వచ్ఛంద సంస్థలను సహాయం కోరాడు. 

        గంటకు వంద కిలోమీటర్లు తగ్గకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా బిడ్డను సమయానికి బెంగళూరుకు చేర్చాడు. పసికందుకు ఆపరేషన్ బాగా జరిగింది. దీనికి ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆంబులెన్స్ డ్రైవర్ కు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్ చేసిన పనికి దేశమంతా అభినందించింది. అంబులెన్స్ డ్రైవర్ ఇంతకుముందు కూడా చాలామంది పేషెంట్స్ ప్రాణాలను సమయానికి హాస్పిటల్ కి చేర్చి కాపాడాడు. 

      అతను చేసిన పని వల్ల ఒక పసి బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు చాలా ఆనందంగా ఉందని సంతోషించారు. నాకు దూరం మరియు సమయం  మైండ్ లో లేదని,  కేవలం ఆ పసి బిడ్డ ప్రాణాలు కాపాడటమే నా లక్ష్యం  అనుకుని ముందుకు సాగి పోయానని ఆనందం వ్యక్తం చేశాడు.

Leave a Comment

error: Content is protected !!