heart touching story of inidan housewife

పెళ్లయిన మొదటి రాత్రి తన భర్తకు మగతనం లేదని తెలిసి ఈ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

ఒక చిన్న షాపు నడుపుకునే సలీంకి తల్లిదండ్రులు లేరు. అతని తల్లి తండ్రిని ఒకే స్మశానంలో సమాధి చేశారు. ప్రతిరోజు సలీం మసీదుకు వెళ్ళి నమాజ్ చేసుకుంటూ ఉండేవాడు. అక్కడి నుండి వచ్చేటప్పుడు సమాధికి వెళ్లి తల్లిదండ్రులకు నమాజ్  చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఇలా రోజు అతని దినచర్య లో భాగంగా ఇది జరుగుతూ ఉండేది. అయితే ఒక రోజు సలీం మసీద్  నుండి వస్తూ స్మసానానికి వెళ్ళాడు. అక్కడ తల్లిదండ్రులకు నమాజ్ చేస్తున్న సమయంలో సలీంకు ఒక అద్భుతమైన సువాసన రావడం గమనించాడు. ఇంతకుముందు ఎప్పుడూ అటువంటి సువాసన సలీం చూడలేదు. ప్రపంచంలోనే అంత గొప్ప సువాసన ఎవరు చూసి ఉండరు  అనిపించింది. అయితే అతడు సువాసన ఎక్కడి నుండి వస్తుంది అని గమనించడానికి చుట్టూ చూశాడు.

 అక్కడికి దగ్గరలోనే ఒక కొత్త సమాధి కనిపించింది. దాని చుట్టూ తాజా గులాబీలు పరచబడి ఉన్నాయి. అతడు సమాధికీ దగ్గరపడే కొద్దీ ఆ సువాసన మరింత ఎక్కువగా అనిపించసాగింది. అతడు ఆ సమాధి దగ్గర కూడా నమాజ్ చేసి తిరిగి వెళ్లే సమయంలో అక్కడి మట్టి నుండి సువాసన వస్తున్నట్లు గమనించాడు. ఆ మట్టిని చేతితో తాకినప్పుడు పొడిగా ఉంది. కానీ చేతిలోకి తీసినప్పుడు చల్లగా మంచులా అనిపించడంతో ఆశ్చర్యపోయాడు. అతడు మట్టిని అక్కడే వేసి తిరిగి ఇంటికి వచ్చాడు. సలీం కి ఉన్న చిన్న షాప్లో బేరాలు చూసుకుంటున్నప్పుడు ఒక కస్టమర్ నీ నుండి మంచి సువాసన వస్తుంది, ఏ అత్తరు అని అడిగాడు. కానీ నేను ఎటువంటి అత్తరు ఉపయోగించలేదు అని చెప్పినా ఆతను నమ్మలేదు. 

అయితే ఆ రోజంతా వచ్చిన కస్టమర్లు అదే మాట చెబుతూ ఉన్నారు. స్మశానం లో మట్టిని తీయడం గుర్తొచ్చింది సలీం కి. తర్వాత ఒక వారం రోజులపాటు సలీం మసీద్ వైపు వెళ్లడం కుదరలేదు. ఆ తర్వాత ఒకరోజు మసీదుకు వెళ్ళి అలాగే తల్లిదండ్రులకు నమాజ్ చేయడం కోసం స్మశానానికి వెళ్ళాడు. అయితే ఈసారి కూడా అతడికి స్మశానంలో ఆ సువాసన వచ్చింది. అతడు వెంటనే కాటికాపరిని ఆ సమాధి ఎవరిది అని అడిగాడు. అప్పుడు అది ఒక స్త్రీ సమాధి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు కాటికాపరి. అయితే సలీంకు ఆ సమాధి దగ్గర ఒక వ్యక్తి తాజా గులాబీలను పెడుతూ వెక్కివెక్కి ఏడ్వడం చూసాడు. అతడు వెళ్లిపోతున్న సమయంలో సలీం వెనకే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పు. కానీ ఆ సమాధి ఎవరిది? ఆమె మీకు ఏమవుతారు? ఆ సమాధి నుండి అంత సువాసన రావడం ఏమిటి ? అంటూ ఆ వ్యక్తిని అడిగాడు. 

ఆ వ్యక్తి నా పేరు అబ్దుల్లా. ఆమె నా భార్య ఫాతిమా. నేను నా తల్లికి ముగ్గురు అక్కల తర్వాత జన్మించాను. మా అమ్మ నన్ను, మా అక్కలను చాలా కష్టపడి పెంచింది. వారు నలుగురు నాకు మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి అని భావించేవారు. అలాగే ఫాతిమాతో నాకు పెళ్లి చేశారు. మా మొదటి రాత్రి రోజు నేను ఫాతిమాకి చెప్పిన నిజం ఎలాంటిదంటే వేరే స్త్రీ అయితే నన్ను కొట్టి, తిట్టి గోల చేసేది. కానీ ఫాతిమా నన్ను ఓదార్చింది. నాకు మగతనం లేదని, ఆమెకు పిల్లల్ని ఇవ్వలేను అని చెప్పినప్పుడు ఫాతిమా ఇకపై మీకు నేను, నాకు మీరు మాత్రమే పిల్లలు అవసరం లేదు అంటూ నన్ను ఓదార్చి జీవితకాలం నన్ను అలాగే చూసుకుంది. 

ఎన్నిసార్లు నా తల్లి, అక్కలు తనని పిల్లలు పుట్టని స్త్రీగా అవమానాల పాలు చేసినా ఆమె నా గురించిన నిజం బయట పెట్టలేదు. ఆమె చనిపోయేటప్పుడు కూడా నిజాన్ని ఆమెతో పాటు సమాధి చేసింది. అందుకే దేవుడు ఆమెకు, ఆమె మంచి మనసుకు అలాంటి వరం ఇచ్చాడు ఏమో? నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నీ భార్యను జీవితకాలం ప్రేమగా చూసుకో. ఆమెకు నిజాయితీగా ప్రేమను పంచు. ఆమె ఎప్పుడూ నిన్ను మోసం చేయదు. స్త్రీలకు మనసారా ప్రేమిస్తే జీవితకాలం మనల్ని ప్రాణప్రదంగా చూసుకుంటారు అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. సలీం కూడా  అబ్దుల్లా మాటలకు నిజమే అనుకుంటూ ఫాతిమా సమాధి కి నమాజ్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు.

Leave a Comment

error: Content is protected !!