Herbal hair oil Fast hair growth oil in telugu

జుట్టు పెరుగుదలను పెంచే ఆయుర్వేద హెయిర్ ఆయిల్

జుట్టురాలే సమస్యకు పరిష్కారం చూపే హెయిర్ ఆయిల్ తయారీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఆయిల్ చుండ్రు, దురద సమస్య నాకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మందార ఆకులు తీసుకోవాలి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. జుట్టు పెరగటమే కాకుండా తెల్ల జుట్టు రాకుండా అడ్డుకుంటాయి. తర్వాత జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత పదార్థం కరివేపాకు. ఇది జుట్టు పెరుగుదలకు, జుట్టు నల్లగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది.

 అంతేకాకుండా చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. తర్వాత ఒక హాఫ్ లీటర్ కొబ్బరి నూనె తీసుకోవాలి. తరువాత నానబెట్టిన బాదం పప్పులు ఒక గుప్పెడు తీసుకోవాలి. ఇవి జుట్టును మృదువుగా మార్చడంలో దృఢంగా పెరగడం లో చాలా బాగా సహాయపడుతాయి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలోవెరాకి సైడ్ ఉండే  ముళ్ళు తీసేసి అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి మన జుట్టుకు మంచి కండిషనర్ గా ఉపయోగపడతాయి. తర్వాత పదార్థం ఎండు ఉసిరి ముక్కలు. ఇవి జుట్టుకు పోషకాలను అందించడంలో, విటమిన్ సి అందించడంలో చుండ్రు వంటి సమస్యలు తొలగించడంలో చాలా బాగా సహాయపడుతాయి.

 జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. తర్వాత పదార్థం మందార పువ్వులు. ఇవి నాలుగు పువ్వులను వెనక ఉండే తొడిమలు తీసేసి పువ్వులను వేసుకోవాలి. తర్వాత పదార్థం గుంటగలగరాకు లేదా బృంగ్రాజ్. ఈ ఆకులు జుట్టు పెరుగుదలలో చాలా బాగా పనిచేస్తాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చి కొత్తగా తెల్ల జుట్టు రాకుండా అడ్డుకుంటాయి. జుట్టు పెరుగుదలకు ఉపయోగించే ప్రోడక్ట్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తర్వాత పదార్థం మెంతులు. వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. జుట్టును సిల్కీగా మార్చడంలో మెంతులు చాలా బాగా సహాయపడుతాయి.

 కొబ్బరి నూనె తప్ప మిగతా పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. మెంతులు నానబెట్టి నీటిని బయట పారవేయకుండా ఈ పేస్టు చేసేటప్పుడు వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా నూనె స్టవ్పై పెట్టి అందులో యాడ్ చేసుకోవాలి. నూనె బాగా మరిగి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఈ నూనెను వడకట్టుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని జుట్టు కుదుళ్ల నుంచి అప్లై చేసుకోవడం వలన అందమైన పొడవైన, ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. చేతి వేళ్ళతో బాగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై జుట్టుకు కావలసిన పోషకాలు అంది దృఢమైన జుట్టు పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!