రక్తపోటు అంటే రక్త నాళాల గోడలపై రక్త ప్రసరణ ఒత్తిడి. ఈ ఒత్తిడిలో ఎక్కువ భాగం గుండె ప్రసరణ వ్యవస్థ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేయడం వల్ల వస్తుంది., ఎక్కువగా”రక్తపోటు” అనే పదం పెద్ద ధమనులలో ఒత్తిడిని సూచిస్తుంది. రక్తపోటు ఎక్కువ అయితే అది మెదడు,గుండె ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. దీనివలన బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
దీనికి డాక్టర్ సలహాతో మందులు వాడేవారు కొన్ని విషయాలు కూడా గమనించాలి. రక్తపోటు అనేది 120/80 ఉండాలి అనేది మనందరికీ బాగా తెలిసిన విషయం. కానీ మెడికల్ జర్నల్ ప్రకారం ఒక ఇరవై అటు ఇటు గా ఉండవచ్చు అని చెబుతున్నారు. కానీ చాలా మంది డాక్టర్లు ఈ విషయం చెప్పరు. ఒక ఐదు పాయింట్లు ఎక్కువవగానే రక్తపోటు ఎక్కువైందని మందులు వాడడం మొదలు పెట్టేస్తూ ఉంటాం. రక్తపోటుకు మందులు వాడేటప్పుడు కూడా మన వాడే ఆహారం వాటిపై ప్రభావం చూపుతుందని గమనించాలి.
మనం తినే ఆహారంలో ఉప్పు ఎక్కువ లేదా తక్కువ ఉండటం వలన హైబీపీ లేదా లో బిపి వచ్చే అవకాశం ఉంది. అయితే తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తీసుకునే టాబ్లెట్ కి మనం తినే ఆహారాలు పవర్ తగ్గించడం లేదా పూర్తిగా పనిచేయకుండా చేయడమో చేస్తాయి. అలాంటి ఆహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లు , పచ్చి టమాటా, బంగాళదుంప, చిలకడదుంప, ఆకుకూరలలో పొటాషియం ఉంటుంది. ఇది సోడియంను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
సోడియం, పొటాషియం ఒకే స్థాయిలో ఉంటే రక్తపోటును తగ్గిస్తాయి. దానివలన లోబీపి ఉన్నవారికి సమస్య రావచ్చు. అందుకే హైబిపీ ఉన్నవారు ఇవన్నీ తినవచ్చు. టాబ్లెట్స్ అవసరం లేకుండా రక్తపోటును తగ్గించడంలో ఇవి అద్బుతంగా పనిచేస్తాయి. ప్రకృతి ఆశ్రమాల్లో రక్తపోటును తగ్గించడానికి అరటిపండు, చిలకడ దుంప, వంటివి ఆహారాల్లో ఇస్తూ ఆకుకూరలతో చేసిన గ్రీన్ జ్యూస్, టమాటాతో చేసిన జ్యూస్ ఇస్తుంటారు. ఇవి సహజంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. మన రక్తపోటు హెచ్చు తగ్గులను బట్టి ఆహారాలను తీసుకోవద్దు గమనించండి.