మనం తినే చాలా ఆహారాలు కలిపి వండుకుని తినేస్తూ ఉంటాం. కానీ వాటి వలన కాలంగడిచేకొద్దీ అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని రకాల ఆహారాలు కలిపి తినడం వలన అవి శరీరానికి విషపూరితం అయ్యే అవకాశం ఉంది. అలా తినకూడని కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లు మనకు సంవత్సరం అంతా ఎక్కువగా దొరికే పండ్లలో ఒకటి. అలాగే జామకాయను ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ రెండు కలిపి తినడం వలన కడుపులో గ్యాస్, వికారం, తల నొప్పి, చెడు వాయువు, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవి అజీర్తి , జీర్ణ సమస్యలకు కూడా కారణమవుతూ ఉంటాయి.
అలాగే పనస పండు, పాలు కూడా కలిపి తినకూడదు. ఇలా కలిపి వండుకుని తినడం వలన చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బొప్పాయి పండు, నిమ్మరసం కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనత సమస్యకు కారణమవుతుంది. అలాగే నిమ్మకాయ రసం, పాలు కలిపి తీసుకోకూడదు. నిమ్మకాయలో ఉండే సిట్రస్, పాలు విరిగి పోయేలా చేస్తుంది. ఇవి రెండూ ఒకేసారి తీసుకోవడం వల్ల కడుపులో ఉండే జీర్ణరసాలతో కలిసి ఎక్కువ యాసిడ్స్ విడుదల చేస్తాయి. దీనివలన ఎసిడిటీ ఎక్కువవడం, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది.
రాత్రి సమయంలో ఉసిరి పచ్చడి, నిమ్మకాయ పచ్చడి కూడా తినకూడదు. రాత్రిపూట శరీరంలో వాతం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పచ్చళ్ళు తింటే మెదడులోని సున్నితమైన నాడులు పగిలి పనిచేయకపోయే అవకాశం ఉంది. దీని వలన సడెన్గా పక్షవాతం కూడా రావచ్చు. అలాగే పండ్లలో పుచ్చకాయ, కర్బూజా కలిపి తినకూడదు. ఇవి కలిపి తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. నారింజ మరియు క్యారెట్ కలిపి తినకూడదు. దీనివలన గుండెల్లోఎసిడిటీ, కిడ్నీ సమస్యలు వస్తాయి. అలాగే ఆరెంజ్ మరియు పాలు కూడా కలిపి తీసుకోకూడదు. ఇవి రెండు ఒకేసారి తీసుకోవడం వలన జీర్ణ, ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
కొంతమంది పుల్లటి పదార్థాలు, పాలు కలిపి షేక్స్ చేస్తూ ఉంటారు. ఇవి తీసుకోవడం వలన కడుపులో పాడయ్యే అవకాశం ఉంది. వెంటనే తెలియకపోయినా కాలక్రమంలో వీటి యొక్క అనారోగ్య ఫలితాలు బయటపడొచ్చు. పైనాపిల్లో ఉండే బ్రొమిన్ అనే రసాయన పదార్థం శరీరంలో గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు కారణం అవుతుంది. అలాగే పైనాపిల్, అరటిపండ్లు కూడా కలిపి తీసుకోకూడదు. ఇవి రెండూ త్వరగా జీర్ణం అవ్వవు. అలాగే ప్రమాదకరమైన టాక్సిన్స్ విడుదల చేస్తాయి. ఈ సమస్య పిల్లల్లో, పెద్దవారిలో అధికంగా ఉంటుంది.