జబ్బులేని మనిషి కనిపించడం లేదు ప్రస్తుత కాలంలో. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒకరికి, చిన్నదో, పెద్దదో సమస్య కచ్చితంగా ఉంటోంది. కాలంతో పాటు మనిషి ఆహార అలవాట్లు,
మారిపోతూ వస్తున్నాయ్. మనిషి జీవితకాలం తగ్గుతూ వస్తోంది. పారిశ్రామికంగా మరియు టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న నేడు ఆరోగ్యం అనేది ఏంతో ప్రియం. అందరికి ఆరోగ్యంగా ఉండాలని అనిపిస్తుంది కానీ అది చాలా కష్టమైపోతోంది. అయితే ఆరోగ్యం అనేది కొండమీద కోతి ఏమి కాదు. ఒక చిన్న చిట్కా పాటిస్తే గొప్ప ఆరోగ్యం సొంతమవుతుంది. అయితే అవగాహనా లోపం మాత్రమే ఇన్నాళ్లు మనిషిలో ఉన్న పెద్ద అనారోగ్యం. దాన్ని జయించడానికి వంటింట్లో ఉన్న ఒక అద్భుతం ఆరోగ్యానికి జైకొట్టమంటోంది.
వంటింట్లో కనిలించే గొప్ప ఔషధం వెల్లుల్లి. ఇది ఎంత గొప్ప రోగనిరోధక శక్తి వనరో అందరికి తెలిసినదే. అయితే వెల్లుల్లితో ఇలా చేస్తే శరీరంలో అవయవాల మూలల్లో దాక్కున మలినాలు, జబ్బు తాలూకు లక్షణాలు అన్ని నయమయిపోతాయి. ఆ పద్ధతే వెల్లుల్లి నీళ్లు. వెల్లుల్లి నీళ్లేమిటి విచిత్రంగా అని అనుకుంటున్నారేమో!! వెల్లుల్లి నీళ్లే శరీరంలో సకల రోగాలను తరిమికొట్టి గొప్ప ఆరోగ్యాన్ని సొంతం చేస్తుంది. మరి వెల్లుల్లి నీళ్లేమిటి ఎలా తయారు చేసుకోవాలి?? ఎలా తాగాలి చదవండి. దేశని ప్రయోజనాలు ఏమిటి చదవండి మరి.
వెల్లుల్లి నీళ్ళంటే ప్రత్యేకంగా తయారుచేసేది ఏమి ఉండదు. గోరు వెచ్చని నీటిలో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేయడం. ఆ తరువాత వడగట్టి ఆ నీటిని తీసుకోవడం. రోజులో రెండు నుండి మూడు గ్లాసుల వెల్లుల్లి నీటిని తాగడం వల్ల నరాలలోకి చొచ్చుకుపోయిన జబ్బులు కూడా నయమవుతాయి. ఆంటీజ్ కాదు ఈ వెల్లుల్లి నీటివాళ్ళ కలిగే ప్రయోజనాలు ఇంకా బోలెడు అవన్నీ కూడా చూడండి మరి.
◆ బరువు తగ్గాలని అనుకునేవాళ్లకు వెల్లుల్లి నీళ్లు గొప్ప ఔషధంగా పని చేస్తుంది. శరీరంలో కొవ్వులు కరిగించడంలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అధిక బరువు ఉన్నవారు తప్పక తగవలసిన సులువైన చిట్కా ఇది.
◆చాలామందిలో కనబడే బిపి ని వెల్లుల్లి నీళ్లు నియంత్రిస్తాయి. అలాగే రక్తంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంచడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు వెల్లుల్లి నీటిని నిరభ్యరంతంగా తీసుకోవచ్చు.
◆వెల్లుల్లి నీటిని కాస్త దీర్ఘకాలికంగా వాడటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యకరమైన రక్త స్థాయిలను అభివృద్ధి చేస్తుంది.
◆శరీరంలో ఏ భాగానికి ఇన్ఫెక్షన్ సోకినా నయం చేయగల గుణం వెల్లుల్లి నీటికి ఉంది. ఇది గొప్ప యాంటీ ఇన్ప్లమెటరీ మరియు యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది.
◆మూత్రాశయ ఇన్ఫెక్షన్ లను సమర్థవంతంగా నయం చేయడంలో దోహదం చేస్తుంది.
◆కీళ్లు, మరియు ఎముకల దృఢత్వాన్ని పెంపొందించడంలో వెల్లుల్లి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
◆శరీరంలో త్రిగుణాలలో ఒకటైన వాతాన్ని తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.
చివరగా……
వెల్లుల్లి నీరు పైన చెప్పుకున్న అన్నిటికి పని చేయడమే కాకుండా గొప్ప యాంటీ ఏజింగ్ కారకంగా కూడా పనిచేస్తుంది. మరి వెల్లుల్లి నీటిని తాగుతారు కదూ….
Naku gunde noppi vastundhi,gastic annaru mandhulu vadanu 6 months anni testlu.chesaru,normal,gastic vunnappudu BP kuda vundedhi,eppudu normol aina noppi taggaledu,ecg,2d eco,endoscopy,baiopsi normal salaha evvadi
I am suffering from recurrent uveitis in right eye strongly, left eye slow since 4 yrs, Dr. said Ankylosing spondylitis. Please tell me best health suggestions.