hibiscus health benefits

మందారమేనా అని తీసిపడెయ్యకండి ఇలా కూడా వాడచ్చు మరి.

ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండే పూల మొక్క మందారం. చిన్న ఇల్లు అయినా సరే ఒక మందార మొక్క, ప్రతి రోజు పూచే మందారాలు దేవుడికి , ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లల జట్టులో ముచ్చటగా ఒదిగిపోయేవి అంతేనా!! ఆదివారం వచ్చిందంటే చాలు మందారం ఆకులు రుబ్బి జుట్టుకు హెయిర్ పాక్ వేసుకునేవాళ్ళం. దానివల్ల పెరుగుతున్న మన జుట్టు ను చూసుకుని ఎంత మురిసిపోయేవాళ్లమో. కానీ నేడు మందారం మొక్కలు నల్లపూస అయిపోయాయి, మన జుట్టు కూడా క్రమంగా రంగు మారిపోయి తెల్లవెంట్రుకలతో, పలుచబడిపోయి రాలిపోతూ మూరెడు జుట్టు కాస్తా జానెడు అయిపోయింది. 90% మంది పరిస్థితి  ఇలాగేవుంది మరి. చిన్నప్పటి అనుభవాల వల్ల మనకు మందారం అంటే కేవలం తలకు మాత్రమే ఉపయోగిస్తాం అని తెల్సు కానీ ఈ మందారం వల్ల బోలెడు మిరాకిల్స్ జరుగుతాయి. వాడుకునే విధానంలోనే వండర్స్ ఉన్నాయి. 

మందారంలో రహస్యం…..

మందారంలో విటమిన్ సి, ఖనిజాలు మరియు వివిధ యాంటి ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల గుండెపోటు సమస్య ఉన్నవాళ్ళకు మందారం టీ చాలా బాగా పని చేస్తుంది. మందార టీ ఎరుపు  రంగులో ఉండి పుల్లని రుచిని కలిగి ఉంటుంది. అబితేకాదు ఇది క్రాన్బెర్రీ రుచిని పోలి ఉంటుంది.  మందారం టీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. దీన్ని వేడిగాను లేదా చల్లగాను కూడా త్రాగవచ్చు. ఈ టీలో కేలరీలు తక్కువ మరియు కెఫిన్-ఫ్రీ గా ఉంటుంది.

రక్తపోటు ను నియంత్రిస్తుంది.

మందారం పువ్వులతో టీ తయారు చేసుకుని తాగడం వలన రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.క్రమం తప్పకుండా మందారం టీ తీసుకున్నట్టు అయితే దాదాపు పది పాయింట్ల వరకు రక్తపోటును తగ్గించవచ్చు. అయితేఇది కేవలం ఒక్కసారి తీసుకుంటే కలిగే మార్పు కాదు క్రమం తప్పకుండా మందారం టీ ని రోజులో భాగం చేసుకోవాలి.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

మందార టీలో ఆంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఇది గుండె వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది అలాగే  రక్త నాళాలను ఆరోగ్యం గా ఉంచుతూ శరీరం లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటానికి సహాయపడుతుంది. మందార టీలో ఉండే హైపోలిపిదేమిక్ మరియు హైపోగ్లైసీమిక్ లక్షణాలు మధుమేహంతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. టైప్ II డయాబెటిస్ మరియు లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

కాలేయాన్ని కాపాడుతుంది

మన శరీరంలో ప్రముఖమైనది కాలేయం. కాలేయం ఆరోగ్యంగా ఉంటే మనం దాదాపు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టే. అలాంటి కాలేయానికి రక్షణ కవచంలా మందారం టీ పనిచేస్తుంది. మందారం టీ లో ఆంటి ఆక్సిడెంట్లు శరీరంలో కణజాలం మరియు కన్నాలలో ఫ్రీ రాడికల్స్ ను తటస్థంగా ఉంచుతాయి. దీనివల్ల మనిషి జీవితకాలం పొడిగించుకునేఅవసరం పుష్కలంగా ఉంది

కాన్సర్ ను నివారిస్తుంది

చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ మందారం టీ లో. కాన్సర్ కణాలను విచ్చిన్నం చేసే హైబిస్కస్ ప్రోతోకాతెచుక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లం శరీరంలో ఏర్పడే కాన్సర్ కణుతులను నిర్వీర్యం చేయడం వల్ల కాన్సర్ ను క్రమంగా తగ్గించడానికి కారణం అవుతుంది. ఇలా కాన్సర్ కణాలను విచ్చిన్నం చేయడాన్ని ప్రోగ్రాం సెల్ మరణం అంటారు.

 చివరగా…….

ఇన్ని అద్భుతమైన గుణాలు కలిగిన మందరంను జుట్టు సంరక్షణ కోసం కూడా వాడచ్చు అనే విషయం మనకు అందరికి తెలిసినదే.అలాగే మందార తైలం కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అందరూ మందారం ను ఉపయోగించి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!