hidden-health-benefits-of-betel-leaves

ఇప్పటివరకూ తమలపాకు గురించి ఎవరికీ తెలియని నిజాలు

మన భారతదేశ సంస్కృతి అతిథి మర్యాదలలో రుచికరమైన ఆహారంతో పాటు భోజనం తర్వాత కిళ్ళీ కూడా ఇవ్వడం పరిపాటి. ఆ కిళ్ళీలో ముఖ్యమైనది తమలపాకు. తమలపాకు కిళ్ళీలా నోరు పండించడమే కాకుండా అనేక ఔషధగుణాలు కలిగి ఉంటుంది.  తమలపాకును నాగవల్లి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ తమలపాకులు తేమగల వేడిప్రదేశాలలో పెరుగుతాయి. తమలపాకు రసం గొంతునొప్పి తగ్గడానికి వాడతారు. తాంబూలంగా తినడంవలన దానిలో ఉండే  ఎముకలకు మేలుచేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, కంటిచూపును పెంచే విటమిన్ ఏ, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి అధికంగా ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

శ్వాస కోస సంబంధ వ్యాధుల నివారణకు ఈ ఆకులకు నువ్వులనూనె రాసి కొంచెం వేడి చేసి ఛాతిపై ఉంచుతారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆకుకూరలు ఏ విధంగా జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో అదేవిధంగా తమలపాకు పనిచేస్తుంది. చిన్నపిల్లలకు జలుబు చేస్తే తమలపాకుకు ఆముదం రాసి గుండెలపై వేస్తే జలుబు తగ్గుతుంది. పాలు ఇచ్చే సమయంలో పాలు గడ్డకట్టి స్తనాలునొప్పి చేస్తే  ఈ ఆకులను వేడిచేసి గడ్డలపై కట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. తమలపాకు షర్బత్ తాగితే గుండెబలహీనత తగ్గుతుంది మరియు కఫం తగ్గుతుంది. 

తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మానసిక బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి. విటమిన్ సి మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర కాంతిని పెంచి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. తమలపాకులో ఉండే చెవికాల్ అనే కెమికల్ బ్యాక్టీరియా కట్టడిలో బాగా పనిచేస్తుంది అని నిరూపించబడింది. తమలపాకును తొడిమతో సహా తినకూడదు. అలా తింటే స్ర్తీలలో సంతాన భాగ్యం ఉండదని నమ్ముతారు. అధిక బరువు ఉన్నవారు తమలపాకుతో పది మిరియాలు పెట్టుకుని తిని చల్లనినీళ్ళు తాగుతుంటే నాజూగ్గా ఉంటారు.

 ఔషధంలా వాడాలంటే రసం తీసి వాడుకోవాలి. తమలపాకు, మిరియాల, తులసి కలిపి రసంలా చేసి తాగిస్తే పిల్లలలో జలుబు, దగ్గు తగ్గిపోతాయి. తమలపాకు నోటి దుర్వాసన తగ్గిస్తుంది. పాటలు పాడేవారిలో తమలపాకు మాట స్పష్టంగా ఉండేందుకు తోడ్పడుతుంది. స్పూన్ తమలపాకు రసంలో మిరియాలపొడి కలిపితీసుకుంటే  జ్వరం తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. తమలపాకు రసాన్ని శరీరంలోనికి తీసుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరిగి శృంగార శక్తి పెరుగుతుంది. తమలపాకు ఇంట్లో పెంచుకోవడంవలన ఆర్ధిక ఇబ్బందులు తొలగి డబ్బును ఆకర్షిస్తుందని నమ్ముతారు. 

Leave a Comment

error: Content is protected !!