తండ్రి గరగర తల్లి పీచుపీచు బిడ్డలు మాణిక్యాలు….. అబ్బబ్బా పనసను గుర్తు చేసుకుంటే గుండెనిండా ఆ కమ్మని వాసన పీల్చిన రోజులు గుర్తొస్తాయ్. చిన్నతనంలో ఎంతమంది ఎన్ని వారించినా సుష్టుగా తినేసేవాళ్ళం. పెద్దయ్యాక తినాలంటే షుగర్ల భయం. కొందామంటే ఖరీదు కూడా అయిపోయాయి. అందుకే పనస అపురూపం అయిపోయింది. పనస పొట్టు నుండి గింజ వరకు దేన్ని వృధా చేయకుండా వండుకుని తినేస్తాం.
అలాంటి పనస గింజల లో ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో రహస్యాలున్నాయ్. కావాలంటే మీరే చూడండి.
◆పనసలో ప్రోటీన్ విటమిన్- బి, పొటాషియం, పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి వాటిని అందిస్తుంది పనస.
◆పనస గింజలలో ధయామిన్, రిబోఫ్లోవిన్ పాళ్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపు మెరుగుపడటానికి. చర్మానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఎంతగానో తొడ్పడతాయితాయి.
◆ఈ గింజలలో జింక్, పొటాషియం, ఇనుము, కాల్షియం, రాగి, మెగ్నీషియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి శరీరానికి గొప్ప శక్తిని ఇస్తాయి.
◆పనస గింజలను తీసుకోవడం వల్ల అందులోని యాంటీ మైక్రోబయల్ ప్రభావం మనం పొరపాటున తీసుకున్న విరుద్ధ ఆహార పదార్థాల వల్ల సంభవించే ఫుడ్ పాయిజన్ ను అడ్డుకుంటుంది.

◆పనస విత్తనాలను కాసేపు నీటిలో నానబెట్టి వాటి పొట్టు తీసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి దీన్ని మొహానికి ఫేస్ పాక్ లాగా అప్లై చేయడం వల్ల వయసు వల్ల వచ్చే ముడుతలు, మొహం మీద నల్ల మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
◆గుండెకు మంచి ఆరోగ్యాన్ని చేకూర్చే మంచి కొలెస్ట్రాల్ ను పనగింజలు తీసుకోవడం వల్ల సంరక్షింపబడతాయి. తద్వారా గుండెకు మెదడుకు మధ్య జరిగే సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.
◆పనస గింజల్లో అధిక నాణ్యత గల ప్రోటీన్లు ఉంటాయి. అందుకే పనస గింజలు తీసుకోవడం వల్ల శరీర కండరాల నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయి.
◆పనస గింజల్లో ఉన్న ఐరన్ శాతం శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుదలకు సహకరిస్తుంది. అందుకే రక్తహీనత ఉన్నవాళ్లు పనస గింజలు అందుబాటులో ఉన్నపుడు తప్పక తినాలి

◆మలబద్దకం చాలా మందిని వేధించే సమస్య దానికి పనస గింజలు పరిష్కారంగా కనబడతాయి. అయితే సీజన్ దాటిపోయాక ఇవి దొరకవు కాబట్టి దొరికిన సమయం లో పనస గింజలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఇంట్లో నిల్వచేసుకుని మలబద్దకం సమస్య ఉన్నపుడు తీసుకోవాలి దీనివల్ల బిగుసుకుపోయినట్టు ఉన్న జీర్ణాశయం కూడా వదులుగా అవుతుంది.
◆పనస గింజల్లో దాగిన సూక్మ పోషకాలు చర్మానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తూ చర్మంలో తేమ పాళ్లు తగ్గిపోకుండా కాపాడుతుంది అలాగే పనసకు ఉన్న సువాసన మానసిక ఒత్తిడిని తగ్గించి మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.
చివరగా……..
కొండంత కనిపించే ఈ పండులోని విత్తనాలు కూరల్లో, ఉడికించి, కాల్చుకుని ఎన్నో విధాలుగా తింటూ ఉంటారు అయితే ఆరోగ్య ప్రయోజనాలు గుర్తు పెట్టుకుని పడేయకుండా ఇలా వండుకుంటేనే ఆరోగ్యం చక్కగా పనస తొన అంత మధురంగా ఉంటుంది.