Hidden health facts about ashoka tree

అశోక వృక్షం గూర్చి ఆశ్చర్య పరిచే నిజాలు….

పార్క్ లు కాలేజీలు మొదలైన ప్రాంతాల్లో అందం కోసం బాటకు ఇరువైపులా పెంచిన చెట్లలో అశోక వృక్షాలు కచ్చితంగా ఉంటాయి. నిటారుగా పొడవుగా పెరిగిన ఈ అశోక చెట్లు ఆహ్లాదాన్ని మాత్రమే కాదు బోలెడు ఆరోగ్యాన్ని ప్రసాధిస్తాయని చాలా మందికి తెలియదు. ఈ అశోక వృక్షం, ఆకులు, బెరడు, పువ్వులు మొదలైనవి ఆయుర్వేద పరంగా అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి తెల్సుకుందాం మరి.

స్త్రీ జననేంద్రియ సమస్యలు

స్త్రీలలో జననేంద్రియ సమస్యలు మరియు ఋతు రుగ్మతల చికిత్సలో అశోక చెట్టు ప్రసిద్ది చెందింది.  ఇది గర్భాశయ కండరాలు మరియు ఎండోమెట్రియంకు టానిక్‌గా పనిచేస్తుంది, కడుపులో అసమతుల్యతను మరియు కడుపు నొప్పిని నియంత్రిస్తుంది.

గతితప్పిన నెలసరి సమస్యలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది., డిస్మెనోరోయా, అమెనోరోయా, ల్యూకోరోయా, ఫైబ్రాయిడ్లు, ఊపిరితిత్తులు మరియు ఇతర సంబంధ జబ్బులకు ఉపశమనం గా ఉపయోగపడుతుంది.

చర్మ సంరక్షణకు 

అశోక వృక్షంలో సహజంగా చర్మం యొక్క రంగును మెరుగుపరిచే గుణం ఉంటుంది.  ఇది రక్తాన్ని శుద్ధి చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.  చర్మ అలెర్జీల నివారణకు సహాయపడుతుంది.   అంతేకాక, చెట్టు బెరడు కాలిన గాయాలు మరియు దురదలు తగ్గించడానికి ఉత్తమమైన ఎంపిక.

నొప్పి నివారణ

అశోక చెట్టు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంది దీనిని ఎలాంటి సందేహం లేకుండా ఉపయోగించవచ్చు.  కీళ్ల నొప్పుల కోసం బెరడు యొక్క పేస్ట్‌ను ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.

అంతర్గత రక్తస్రావం

మన శరీరంలో అంతర్గత రక్తస్రావం జరిగే సందర్భాలలో  అశోక చెట్టు పూల సారం రక్తస్రావం ను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే విరేచనాలతో బాధపడుతున్నవారికి  చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.  విరేచనాల నివారణకు అశోక పుష్పాల పొడి ని నీళ్లతో కలిపి తీసుకోవాలి.

డయాబెటిస్

అదేవిధంగా, అశోక చెట్టు నుండి ఎండిన పువ్వులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సహాయపడతాయి.  అశోక కషయాన్ని తీసుకోవడం వల్ల మధుమేహాన్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు

పైల్స్ ( మొలలు)

అశోక చెట్టు సారాలను అంతర్గత పైల్స్ చికిత్సలో మరియు పైల్స్ కారణంగా జరిగే రక్తస్రావం తగ్గించడానికి ఉపయోగిస్తారు. అశోక  బెరడు నుండి తయారుచేసిన మూలికా మందులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి.

అంటువ్యాధులు

ఈ  చెట్టు బెరడును ఉపయోగించడం వల్ల  ఫంగల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.  బెరడు శరీరాన్ని  శుద్ధిచేయడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.  

నులిపురుగుల నివారణకు

అశోక చెట్టు యొక్క ఆకులు లేదా బెరడు తీసుకోవడం ద్వారా నులిపురుగు బారిన పడే అవకాశం ఉండదు. అంతే కాదు  నులిపురుగులు ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల నులిపురుగులను నిర్మూలించడమే కాకుండా   కడుపు నొప్పిని, ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.

కిడ్నీ స్టోన్స్ ( మూత్రపిండాల్లో రాళ్లు)

మూత్రపిండాల్లో రాళ్లను నియంత్రించడానికి అశోక చెట్టును వినియోగించవచ్చు.  పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను కరిగించి వేస్తుంది.

చివరగా…..

అశోక చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నా  గర్భిణీలు దీన్ని తీసుకోవడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదముంది కాబట్టి గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి.

Leave a Comment

error: Content is protected !!