హలో ఫ్రెండ్స్ చాలామంది ఏమనుకుంటారంటే ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో లేదా ఎవరైతే ఎక్కువగా తీపి పదార్థాలు తింటారో కేవలం అలాంటి వారి శరీరంలోని షుగర్ శాతం పెరుగుతుంది అనుకుంటారు. కానీ అది అసలు నిజం కాదు. హై బ్లడ్ షుగర్ సమస్య ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది మరియు ఇది మనకు వచ్చినట్టు కూడా తెలియదు.
శరీరంలో షుగర్ శాతం బాగా పెరిగిపోతే ఇది మన శరీరాన్ని మెల్లమెల్లగా తినేస్తుంది దీని పూర్తి ప్రభావం మన శరీరం లో ఉండే అవయవాలు నరాలు కళ్ళు మరీ ముఖ్యంగా మన శరీరం యొక్క ఎనర్జీ లెవెల్స్ మీద పడుతుంది. మన శరీరంలో ఏర్పడే చిన్న లేదా పెద్ద సమస్యలను ఏదో ఒక రూపంలో లో తెలియజేయాలని చూస్తూ ఉంటుంది. ఒకవేళ మనం తెలియజేసే లక్షణాలను సమయం మించి పోకుండా ముందుగానే గుర్తిస్తే భయంకరమైన అనారోగ్యాల నుంచి ముందుగానే బయటపడవచ్చు. అందుకే ఈ రోజు మనం మన శరీరం లోపల షుగర్ శాతం పెరిగితే ఎలాంటి లక్షణాలు బట్టి ముందుగానే ఎలా తెలుసుకోవచ్చు అనే విషయం గూర్చి తెలుసుకుందాం .. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.
పదే పదే ఆకలి వేయడం ఒకవేళ మీకు భోజనం చేసిన తర్వాత కూడా ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటే దీని అర్థం మీ శరీరంలో షుగర్ శాతం బాగా పెరిగిపోయిందని అర్థం. హై బ్లడ్ షుగర్ శరీరం యొక్క గ్లూకోజ్‌ను వాటి కణాలకు చేరకుండా అడ్డు పడుతుంది దీని వల్ల మన శరీరానికి పూర్తి శాతం ఎనర్జీ అందదు. అందువల్ల మనకు పదే పదే ఆకలి వేస్తూ ఉంటుంది.
శరీరం అలసిపోవడం. మీకు కనుక ఉదయాన్నే నిద్రలేవడం తోనే అలసటగా అనిపిస్తూ రోజు గడిచేకొద్దీ ఎక్కువగా అలసి పోయినట్లు అనిపిస్తుంటే ఇది మీ శరీరంలో షుగర్ శాతం బాగా పెరిగిపోయిందని ఒక లక్షణంగా చెప్పవచ్చు. ఎందుకంటే శరీరంలో షుగర్ శాతం బాగా పెరిగిపోతే మన శరీరం మన ఎనర్జీని పూర్తి శాతం వినియోగించుకోలేదు. దీనివల్ల మన కణాలకు అవసరమైన ఇంధనం అందదు. అందువల్ల మన శరీరంలో ఎలాంటి కారణం లేకుండా అలసటగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు గనక తీపి పదార్థాలు తినడం ఒక్క సారిగా మానుకో లేకపోతే దీనికి మీరు పంచదార స్థానంలో తేనెను ఉపయోగించండి. హై బ్లడ్ షుగర్ వల్ల మన కిడ్నీలు మన శరీరం లోపల ఉండే లిక్విడ్ ను పూర్తి శాతం పీల్చుకో లేవు.