గ్యాస్ట్రిక్ సమస్యను పూర్తిగా తగ్గించే చిట్కా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది సోంపు లేదా సోపు అని కూడా అంటారు. చాలా మందికి భోజనం తర్వాత వక్కపొడి, కిల్లి లేదా సోంపు తినే అలవాటు ఉంటుంది. దీనినే స్థూల జీరా కూడా అంటారు. స్థూల అంటే లావుగా ఉండటం జీరా అంటే జీలకర్ర అని అర్థం. దీనినే మధురిమా అని కూడా అంటారు. సోంపులో తీయనైన ఫ్లవర్ ఉండటం వల్ల మధురిమ అని కూడా అంటారు.సోంపులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఎనితాల్, ఫైబర్ అధికంగా ఉంటాయి.
శరీరంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అయినప్పుడు గొంతులో మంట, కడుపులో మంట వస్తాయి. దీనిలో ఉండే ఎనితాల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని తగ్గించి ఈ సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరానికి అవసరమైన మంచి ఎంజైమ్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. సోంపు లో ఉండే ఆల్ఫా ఫినాన్డ్రిన్ రసాయనిక పదార్థం శరీర రక్షక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో రక్షణ వ్యవస్థను పెంపొందించేందుకు ఆల్ఫా ఫినాండ్రోన్ బాగా ఉపయోగపడుతుంది.
రక్షక వ్యవస్థలోని కణాలను చైతన్యవంతం చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు పొద్దున తిన్న తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒక టీ స్పూన్ లేదా ఐదు గ్రాముల సోంపు నమిలి తినేయాలి. ఎలాంటి కాషాయాలు, పొడులు చేసుకొనవసరం లేకుండా నాచురల్ మెడిసిన్గా వాడుకోవచ్చు. సోంపు గింజలను వేయించి గాజుసీసాలో పెట్టుకొని ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ నమిలి మింగేసి నీళ్లు తాగితే సరిపోతుంది. నమలలేని వారు చూర్ణం చేసుకుని ఒక కప్ నీటిలో కలుపుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే సరిపోతుంది. సోంపు తినటం వలన నోటి దుర్వాసన, మలబద్ధకం తగ్గుతుంది. శరీరం డీటాక్సిఫై అవ్వడం లో సోంపు బాగా ఉపయోగపడుతుంది.
ఎడ చూస్తాం.నెలరోజులు మీ సులభం ప్రాకృతిక సూచనను పాటించి ఫలితం ఉంటే మరి కొందరి మితృలకు మిమ్ములను,మీ సూచనను పరిచయం చేస్తాను.🙏🏽