High Protein Curd Making at Home

వేరుశనగ పెరుగు…… ఇది తింటే మీ ఒంట్లో పోషకాలు పెరుగుతాయి……….

వేరుశనగపప్పుని మనం ఏ రకంగా ఉపయోగించుకున్నాను దాని వలన చాలా మంచి ప్రయోజనాలు మన ఆరోగ్యానికి కలుగుతాయి. ఇప్పుడు మన ఇంట్లోనే వేరుశనగ పెరుగును ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ప్రస్తుత కాలంలో ఆవు పాలు లేదా గేదె పాలు చాలామందికి పడడం లేదు. వీరికి లాక్టోజ్ ఎలర్జీ వలన ఆల్టర్నేట్ గా వేరే పాలపై ఆధారపడవలసి వస్తుంది. మామూలు పాలు అయితే 80-90% శక్తి ఇస్తుంది. అదే వేరుశెనగ పాలు అయితే వీటికన్నా 5 లేదా 6 రెట్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి.

మామూలు పాలలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ వేరుశనగపాలలో కొలెస్ట్రాల్ ఉండదు. మరియు హై ప్రోటీన్. మామూలు పాలకంటే అయిదారు రెట్లు ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. అందువలన వీటిని ఉపయోగించడం వల్ల చాలా మంచి పోషకాలు లభిస్తాయి. అలాంటి వేరుశనగపప్పు పాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. వేరుశనగ పప్పులను పావు కేజీ తీసుకొని వాటిలో నీళ్లు పోసుకుని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన వేరుశనగపప్పులను నీటిలోంచి తీసి బాగా కడగాలి.

ఆ తర్వాత నానిన వేరుశనగపప్పులను ఒక మిక్సీ జార్లో వేసుకుని అందులో కొన్ని నీటిని పోసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరుశనగపప్పు ముద్దను ఏదైనా ఒక గిన్నెలోకి ఒక పొడి గుడ్డ సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత మిగిలిన పేస్టు మరలా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీటిని పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన పేస్టును మరల వడకట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా వేరుశనగ పాలు తయారవుతాయి. ఇప్పుడు ఈ పాలను ఒక కడాయిలోకి తీసుకొని కొద్దిగా మరగనివ్వాలి.

ఇప్పుడు వేరుశనగ పెరుగు తయారు చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో ఒక స్పూన్ గడ్డ పెరుగు తీసుకొని బాగా గీలక కొట్టాలి. ఆ తర్వాత గోరువెచ్చని వేరుశనగ పాలు వేసుకొని ఐదు ఆరు గంటలసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత చూస్తే వేరుశనగ పెరుగు తయారవుతుంది. ఇది చాలా హెల్దీ పెరుగు. అంతేకాకుండా చాలా బలమైనది. అంతేకాకుండా జీరో కొలెస్ట్రాల్ పెరుగు. అందువలన ఈ పెరుగు తయారు చేసి ఉపయోగించుకోవడం ద్వారా మనకు మంచి ఆరోగ్యంతో పాటు శక్తిని కూడా అందిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఉపయోగించండి…..

Leave a Comment

error: Content is protected !!