యూత్ అందరికీ ఒక స్పెషల్ కోరిక ఉంటుంది. అది ఏంటంటే మగవారు అయితే సిక్స్ ప్యాక్ ఉండాలి అని, ఆడవారైతే సైజ్ జీరో ఉండాలి. కానీ ఇలా ఉన్నవారు పూర్తిగా హల్దీగా ఉన్నారు అనేది అపోహ. ఒకవేళ మీరు అలా ఉంచాలి అన్నా అది సాధ్యం కాదు. మీరు తక్కువ టైంలో ఎక్కువగా షేప్ రావడానికి చేసే ప్రయత్నంలో వారు తీసుకునే డైట్ బాడీ ప్రిన్సిపల్స్కు 100% రివర్స్ లో ఉంటుంది. నేచర్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఇచ్చింది. తర్వాత ఫ్యాట్ తర్వాత ప్రోటీన్. కానీ సిక్స్ ప్యాక్ ట్రై చేసే వాళ్ళు దీనికి రివర్స్లో తీసుకుంటారు. అంటే ఫస్ట్ ప్రోటీన్, తరువాత ఫ్యాట్ తర్వాత కార్బోహైడ్రేట్.
సిక్స్ ప్యాక్ లో అవి రావాలంటే పూర్తిగా వీరి శరీరంలో కొవ్వు అనేది కరిగిపోవాలి. కేవలం రోజులో ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటారు. ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అస్సలు ఉండకుండా చూసుకుంటారు. అంతా రీవర్స్ లో చేయడం వల్ల వీళ్ళకు అంతా నష్టం జరుగుతుంది. మరియు ప్రోటీన్ షేక్ హాఫ్ లీటర్ వరకు తాగేస్తారు. ఇది కృత్రిమంగా తయారు చేసిన షేక్ కాబట్టి అందులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఉండవు. మరియు మధ్యాహ్న సమయంలో ఎక్కువగా ఎగ్ వైట్ తీసుకుంటూ ఉంటారు. మరి సాయంత్రం డిన్నర్ సమయంలో కేవలం చికెన్ మాత్రమే తింటారు. ఇలా తీసుకుని ఎక్సైజ్ చేస్తూ ఉంటారు.
ఎక్సైజ్ మంచిది గానీ తక్కువ టైంలో ఎక్కువ చేయడం వలన బాడీ చాలా అలసిపోతుంది. కానీ దానికి తగ్గట్టు న్యూట్రియంట్స్ ఇక్కడ ఉండవు. ఈ న్యూట్రియెంట్స్ లో ఫ్యాట్ సాలీబుల్ విటమిన్స్ ఫ్యాట్ లో ఉంటాయి. ఫ్యాట్ కనుక కరిగిపోతే అవి కూడా కరిగిపోతాయి. కనుక ఇది లేకపోతే హార్మోన్ ప్రొడక్షన్స్ సరిగా ఉండదు. బ్రెయిన్ డెవలప్మెంట్ కు ఫ్యాట్ కావాలి. సెల్ మెంబారీన్ కు ఫ్యాట్ కావాలి. ఇలాంటి వాటి అన్నింటికీ ఫ్యాట్ కావాలి. అందువలన ఇలాంటి వారు అందరూ సప్లిమెంటరీ ఎక్కువగా తీసుకోవాలి. కనుక దీనివలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
దీనికి ప్రకృతి విధానం ప్రకారం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఉదయం 10 గంటలకు స్ప్రౌట్స్, కొంత కొబ్బరి కొన్ని వేరుశనగలు తినాలి. మరల సాయంకాలం అన్ని రకాల వాల్నట్స్, డ్రైనాట్స్, వీటితోపాటు ఫ్రూట్స్ కలిపి తీసుకోవాలి. రైస్ పుల్కాలు ఇలాంటివి తినకుండా సోయా మిల్క్ తాగుతూ ఈ ఫాస్టింగ్ చేస్తే మనం ఫిట్ గా ఉండవచ్చు