High Protein Low Calorie Lunch Box Improves Body Strength

తిన్న వెంటనే బలాన్ని ఇచ్చే ప్రోటీన్ ఫుడ్స్………. బయటి భోజనం కంటే వంద రెట్లు బెస్ట్……. పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయి……

కొన్ని సమయాల్లో సమయానుకూలంగా భోజనం తీసుకోవడానికి కుదరదు, మరియు కొన్ని చోట్ల భోజనం కూడా లభించదు. కొంతమందికి భోజనం లభించిన అది హైజనీక్ గా ఉండకపోవచ్చు లేక కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇలాంటి సమయాలలో భోజనం తిన్నట్లుగా శక్తిని ఇచ్చి కడుపు నిండుగా అనిపించే విధంగా ఉంటేనే పొట్ట కొంచెం దండిగా అనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో మొక్కజొన్న కండెలను ఉడకబెట్టి మార్కెట్లో ఎక్కువగా అమ్ముతున్నారు. ప్రస్తుత కాలంలో ఇది దొరకని ప్రాంతం అంటూ ఏమీ లేదు.

                         సంవత్సరం పొడుగునా స్వీట్ కార్న్ రూపంలో లభిస్తూనే ఉన్నాయి. ఇలాంటి కండెలను రెండు కొనుక్కొని వేడివేడిగా తింటే కనుక కడుపు నిండుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇవి ఎక్కడైనా తినవచ్చు. ఈ గింజలు 100 గ్రాములు తీసుకుంటే 84 క్యాలరీల శక్తి వస్తుంది. కనుక వీటిని రెండు  తింటే కడుపుకి భోజనం తిన్నట్టే లెక్క. దీనితో పాటు ఒక ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. లేదా ఇంకొక విధంగా కూడా మొక్కజొన్నలు చూసుకోవచ్చు. కాల్చినవి కూడా మార్కెట్లో ఎక్కువగా లభిస్తూనే ఉంటాయి. కాల్చిన ఖండెలు రెండు తింటే ఒక గ్లాస్ అన్నం తిన్నట్టు లెక్క.

                            శక్తి కూడా బాగా ఎక్కువగా అనిపిస్తుంది. మూడవ ఆప్షన్ ఏమిటంటే కొబ్బరి భోజనం. ఇది కూడా అన్నం కంటే ఎక్కువ శక్తిని ఇస్తుంది. అరటిపండు నంచుకుంటూ కొబ్బరి ముక్క తింటే రెండు పుటల తిన్న శక్తి లభిస్తుంది. అధిక శక్తిని అందిస్తుంది. గట్టి కొబ్బరి తినలేము అనుకున్న వాళ్లు లేత కొబ్బరి కూడా తీసుకోవచ్చు. అన్నం తింటే కేవలం కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. కానీ వీటిని ఆహారంగా తీసుకుంటే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా పొషకాలు అన్ని అందుతాయి. మరియు ఉప్పు, నూనెలు కూడా ఉండవు.

                           కనుక ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా ఆహారం కోసం ఇబ్బంది పడకుండా కడుపు నింపుకోవచ్చు. ఇంకా కావాలి అంటే మరమరాలను దొరగా వేయించుకుని అందులో వెయించిన పల్లీలు, జీడిపప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు,పర్చి మిర్చి ముక్కలు వేసి మసాలా మిక్చర్ చేసుకొని వీటితో పాటు ఫ్రూట్స్ తీసుకుంటే చాలు సరిపోతుంది. ఇంకా కావాలి అంటే అటుకుల మిక్సర్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా హెల్దీ ఫుడ్ తీసుకోంటే ఎక్కడ ఉన్నా ఆహారంను మెనెజ్ చేసుకోవచ్చు…

Leave a Comment

error: Content is protected !!