సాధారణంగా మనం శనగల గుగ్గిళ్ళు, శనగల చాట్లు, శనగల తాలింపు, పేరంటాలకు అది శనగలు పంచి పెడుతూ ఉంటాం. మామూలుగా నాటు శనగలు కంటే ఎక్కువగా కాబోలి శనగలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అంటే కాబోలి శనగలు తేలిగ్గా జీర్ణం అవుతాయి. గ్యాస్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఎవరైనా ఎక్కువగా వీటినే వండుకోవడానికి ఇష్టపడతారు. ఈమధ్య సలాడ్స్ తినడం అనేది ఆరోగ్యానికి మంచిది అని, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి క్యాలరీస్ ఎక్కువగా ఉంది కార్బోహైడ్రేట్స్ ని కట్ చేసే విధంగా సలాడ్ ఇప్పుడు చూద్దాం.
ప్రోటీన్స్ సలాడ్స్ కావాల్సిన పదార్థాలు నానబెట్టిన కాబోలి శనగలు ఒక కప్పు, టమోటా పేస్ట్ ఒక కప్పు, మొలకెత్తిన పెసలు హఫ్ కప్పు, నానబెట్టిన వేరుశనగ గింజలు హాఫ్ కప్, పన్నీర్ ముక్కలు హాఫ్ కప్, టమాటా ముక్కలు పావు కప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, సన్నగా తరిగిన కీరదోస ముక్కలు పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, నిమ్మరసం రెండు స్పూన్లు, తేనె ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు సలాడ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న సైజ్ కుక్కర్ తీసుకొని కాబోలి శనగలు వేసి అందులో టమాటా పేస్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి.
ప్రోటీన్ సలాడ్ కలుపుకునే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక పెద్ద గిన్నెలో నానబెట్టిన వేరుశనగ పప్పులు, క్యాప్సికం ముక్కలు, టమాట ముక్కలు, మొలకెత్తిన పెసలు, పన్నీరు ముక్కలు, క్యారెట్ తురుము, కీరదోస ముక్కలు, టమాటా రసంలో ఉడికిన కాబోలి శనగలు, మిరియాల పొడి, నిమ్మరసం, తేనె ఇది కొద్దిగా వేస్తే సలాడ్ చప్పదనం పోతుంది. కొత్తిమీర కూడా పైన అలా చల్లుకోవాలి ఈ మొత్తం అన్నిటిని రెండు గరిటెల సహాయంతో బాగా కలుపుకోవాలి.
ఎవరైనా రా ఫూడ్ తినే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో లంచ్ ఇలా చేసుకుని తింటే చాలా సులభంగా తినగలుగుతారు. దీనిని ప్రోటీన్స్ సలాడ్స్ అని కూడా అనవచ్చు. అంతే కాకుండా హై ఫైబర్ సలాడ్స్ అని కూడా అనవచ్చు. కనుక ఇది తినడం వలన మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉండవు. మంచి పౌష్టికాహారం…