High Protein Soya and Beans Curry

వీటిని 12 గంటలు నీటిలో నానబెట్టి కూర వండుకొని తింటే హై ప్రోటీన్స్ లభిస్తాయి…

బాలింతలు బరువు పెరగకుండా హై ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి. 100 గ్రాముల సోయా చిక్కుడు గింజలలో 43-44 గ్రా. ప్రోటీన్ ఉంటుంది. ఆహారాలలో హై ప్రోటీన్ ఉన్న ఆహారం సొయా చిక్కుడు. సుమారుగా 430 క్యాలరీల వరకు శక్తి లభిస్తుంది. ఇది అందుకని చాలా ఎక్కువ బలం. కనుక ఇటువంటి సోయాబీన్ 12 గంటలు నానబెట్టి వాటిని కొబ్బరి ఉపయోగించి కూర వండుకుంటే మంచి బలం, కొబ్బరి వలన బ్రెయిన్ డెవలప్మెంట్ కావాల్సిన అన్ని మంచి పోషకాలు లభిస్తాయి. అందువలన బాలింతలు కొబ్బరి కూడా వాడుకోవడం చాలా మంచిది.

                              ఇలా కొబ్బరిని ఉపయోగించుకుంటే పిల్లలకు పాలు బాగా వస్తాయి. అంతేకాకుండా తల్లికి మంచి బలం, బరువు కూడా పెరగరు. ఇలాంటి హెల్తీ సోయా చిక్కుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు నానబెట్టిన సోయా గింజలు, చిక్కుడు గింజలు ఒక కప్పు, పుల్లటి మజ్జిగ రెండు కప్పు, టమాట ముక్కలు ఒక కప్పు, కొబ్బరి తురుము హాఫ్ కప్, పెరుగు ఒక కప్పు, వేపించిన వేరుశనగలు హాఫ్ కప్, పచ్చిమిర్చి ముక్కలు ఐదారు, అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్.

                      మిగడ రెండు స్పూన్లు, షాజీరా ఒక టేబుల్ స్పూన్, మిరియాలు ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క ఒకటి, బిర్యానీ ఆకు ఒకటి, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఈ కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ముందుగా నానబెట్టిన సోయా గింజలు ఒక కప్పు పుల్లటి మజ్జిగ వేసి సోయా గింజలను ఉడకబెట్టాలి. గ్రేవీ కోసం ముందుగా చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా గట్టి పెరుగు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.

                           ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకొని దానిలో మిరియాలు, షాజీరా, కరివేపాకు, సన్నగా తురిమిన అల్లం ముక్కలు చిక్కుడు గింజలు వేసి ఒక స్పూన్ మిగడ కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, పుల్లటి మజ్జిగ వేసి చిక్కుడు గింజలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న సొయా చిక్కుడు గింజలు, మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత నిమ్మరసం కొత్తిమీర వేసి దించుకోవాలి. ఇప్పుడు సోయా ఆర్డినరీ చిక్కుడు గ్రేవీ కర్రీ తయారవుతుంది…

Leave a Comment

error: Content is protected !!