High Protein Soya Tofu Process

చిన్న ముక్క తిన్నా చాలు ఒంటికి మంచి ప్రోటీన్ లభిస్తుంది……… శరీరానికి మంచి బలాన్ని అందిస్తుంది…

చాలావరకు టోఫు లేదా పన్నీరు అనేది సాధారణంగా పాలతోనే తయారు చేస్తూ ఉంటారు. పాలతో తయారు చేసిన తోఫు అయితే ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బలం కూడా తక్కువగా ఇస్తుంది. అదే ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే సోయా టోఫు అయితే దగ్గర దగ్గరగా 15 రెట్లు ఎక్కువ ప్రోటీన్ అందిస్తుంది. అంతేకాకుండా నాలుగు రెట్లు ఎక్కువ బలాన్ని అందిస్తుంది. అంటే పాల కంటే ఎక్కువగా సోయాలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటి తోఫు ముఖ్యంగా ఆంటీ కొలెస్ట్రాల్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా గుడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కు కూడా చాలా మంచిది.

                               ఇలాంటి తోఫు హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. దీనికోసం ముందుగా సోయా చిక్కుడు గింజలను 12 లేదా 13 గంటలసేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఒక కప్పు సోయా గింజలను నీటిలోంచి వడగట్టి అందులో వేడి నీటిని పోయాలి. ఈ వేడి నీటితో సోయా గింజలను కడిగితే అందులో ఉండే జిగురు మరియు వాసన పోతుంది. ఇలా నీటితో కడిగిన తర్వాత వడకట్టి సోయా గింజలను ఏదైనా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీటిని పోసుకొని నాలుగైదు సార్లు మిక్సీ పట్టుకోవాలి.

                                ఇలా మిక్సీ పట్టుకోగా వచ్చిన మిశ్రమాన్ని ఏదైనా ఒక గుడ్డ సహాయంతో ఒక గిన్నెలోకి వాడకట్టుకోవాలి. ఇలా వడకట్టుగా వచ్చిన పాలను సోయా పాలు అంటారు. ఇలా తయారైన సోయా పాలను ఉపయోగించి టోఫు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తయారు చేసుకున్న సోయా పాలను పాలు మాదిరిగా స్టవ్ పై ఉంచి మరగనివ్వాలి. ఇలా మరిగిస్తే పాలు పచ్చివాసన పోతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే విష తుల్యలు కూడా తొలగించబడతాయి. పాలు మరుగుతూ ఉండగా పాలపై వచ్చిన నురగను తీసివేయాలి. ఇలా మరిగిన పాలను చల్లారితే పాలపై మీగడ వస్తుంది.

                      పాలపై వచ్చిన మీగడ కూడా తీసి అందులో రెండు స్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం వలన పాలు విరుగుతాయి. ఇలా విరిగిన పాలను ఏదైనా గుడ్డ సహాయంతో వడకట్టుకుంటే వచ్చే పాల విరుగుడును సోయా టోఫు అంటారు. ఈ తోఫుని ఫ్రిజ్లో ఒక గంట సేపు ఉంచాలి. ఆ తర్వాత మనకు కావలసిన షేప్ లో కట్ చేసుకోవాలి. ఇలా తయారైన సోయా టోఫును పన్నీరు మాదిరిగా ప్రతి దాంట్లో ఉపయోగించుకోవచ్చు…

Leave a Comment

error: Content is protected !!