High Strength Food Improves Body Power

మీకు ఏ డాక్టరు దీని గురించి చెప్పరు…!

మన ఇంట్లో వాడుకునే కొబ్బరి వెనక ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 100 ml కొబ్బరి నీళ్లలో 24 క్యాలరీల శక్తి వస్తుంది. అందుకని ఈ  కొబ్బరినీళ్లను బరువు ఉన్నవాళ్లు తాగవచ్చు. షుగర్ ఉన్నవాళ్లు కూడా తాగవచ్చు. కొబ్బరి నీళ్లలో ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ లాంటివి. సమ్మర్ లో ఉప్పు బాగా లాస్ అయిందని ఉప్పు వేసుకుని తినకుండా ఒక కొబ్బరి బొండం తాగితే రోజు మొత్తానికి సరిపడే సోడియం లభిస్తుంది. ఇలా తాగితే మినరల్స్ వస్తాయి. శరీరంలో వేడి తగ్గుతుంది చలవ చేస్తుంది. అలాగే ఫాస్టింగ్ చేసినప్పుడు లవణాలు తగ్గకుండా ఈ కొబ్బరి నీళ్లు  తీసుకుంటే మంచిది.

                కొబ్బరి బొండంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ సెలైన్ బాటిల్ లో ఎన్ని ఉంటాయో అన్ని ఉంటాయి. ఇక పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి లో ఎన్ని పోషకాలు ఉన్నాయి అంటే. పచ్చి కొబ్బరి 100 గ్రాములు తీసుకుంటే 440 గ్రాములు క్యాలరీలు శక్తి ఇస్తుంది. అదే ఎండు కొబ్బరి తీసుకుంటే 650 వరకు శక్తిని ఇస్తుంది. పచ్చి కొబ్బరి లో కార్బోహైడ్రేట్స్ నాలుగు గ్రాములు ఉంటే ఎండు కొబ్బరిలో ఏడు గ్రాములు ఉంటుంది. కొబ్బరి నీళ్ళను లూజ్ మోషన్స్ అయినప్పుడు ఎక్కువగా తీసుకుంటారు. స్లో గా ఈ నీళ్లను తాగుతూ ఉండాలి. వాంతింగ్స్ అయినప్పుడు కూడా ఈ కొబ్బరినీళ్ళని తీసుకుంటే శరీరానికి చాలా లవణాలను అందిస్తుంది.

                 పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు గా చేసి మొలకలతో పాటు తినొచ్చు. బరువు పెరగాలనుకున్నవారు, గర్భిణీలకు, బలవంతులకు, చిన్న పిల్లలకు, తెలివితేటలు బాగా పెరగడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి పాలను కూడా వంటల్లో వేసుకుని వండుకోవచ్చు. చంటి పిల్లలకు తల్లిపాలు గేదె పాలు పడినప్పుడు ఈ కొబ్బరిపాలను పట్టొచ్చు. ఇది అధికమైన శక్తి మేక, కోడి కంటే ఆరు రెట్లు బలం ఎక్కువ. అధిక బరువు ఉన్నవారు కానీ కొవ్వు కరగాలనుకునేవారుగాని ఫ్యాటీ లివర్ ఉన్నవారు గానీ వాడకూడదు. ఎండు కొబ్బరిని స్వీట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని వంటల్లో కొద్దిగా వాడుతూ  ఉంటారు తప్ప ఎక్కువగా దీనిని వాడరు.

                 దీనిలో 63% ఫ్యాక్ట్ ఉంటుంది కాబట్టి దీనిని ఎక్కువగా తిన్నారు. ఈ కొబ్బరి తింటే మేధాశక్తి బాగా పెరుగుతుంది. ఇది గుడ్ కొలెస్ట్రాల్ ని అందిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!