Himalayan Single Clove Garlic Beneficts.

ఈ వెల్లుల్లి ఎక్కడైనా కనబడితే అసలు వదలకండి!!

మనం వంటల్లో వాడే వాటిలో వెల్లుల్లి చాలా వరకు ఉంటుంది. ముఖ్యంగా మసాలా వంటకాల్లో వెల్లుల్లి లేకపోతే  ఆ వంటకు రుచి కూడా సరిగా ఉండదు. వెల్లుల్లి ఎంత గొప్ప ఔషధమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ వెల్లుల్లిని కూడా మించిన మరొక అద్భుత ఔషధం ఉంది అదే హిమాలయ వెల్లుల్లి. హిమాలయ వెల్లుల్లి ఏంటి అని అనిపించవచ్చు. చాలామందికి పరిచయం లేని ఈ హిమాలయ వెల్లుల్లి సాధారణ వెల్లుల్లి కంటే దాదాపు 7 రేట్లు ఎక్కువ శక్తివంతమైనది. మన వెల్లుల్లి లాగా బోలెడు వెల్లుల్లి పాయలు కలిసి ఒక గడ్డ లాగా కాకుండా,  కేవలం ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బ మాత్రమే ఉండి, సన్నని తామర మొగ్గలగా ఉంటుంది. మరి ఈ వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి తెలుసుకుందాం.

 అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

 హిమాలయ  వెల్లుల్లి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.  మానవ శరీరంలో వెల్లుల్లి సమర్థవంతంగా కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది.  3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ముఞ్చి ఫలితం ఉంటుంది.  

 జలుబు మరియు దగ్గును నయం చేస్తుంది

 ఈ వెల్లుల్లి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  జలుబు మరియు దగ్గు వచ్చే ప్రమాదాన్ని 50% పైగా తగ్గించడానికి సహాయపడుతుంది.  అదనంగా, ఇది ఇతర వ్యాధుల బారిన పడే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.  అల్లినేస్ మరియు అల్లిన్ అనే రసాయన సమ్మేళనాల ఉనికి వెల్లులిని చూర్ణం చేసినప్పుడు లేదా పేస్ట్ గా చేసినప్పుడు అల్లిసిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం తయారవుతుంది. ఇవి జలుబు మరియు దగ్గును తగ్గించడానికి సహాయపడతాయి.  2 వెల్లుల్లి రెబ్బలను ఉపయోగించి తయారు చేసిన జ్యుస్ లో కాసింత నీటిని కలిపి తీసుకోవడం వలన జలుబు మరియు దగ్గు సులువుగా నయమవుతాయి.  

 క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది

సహజమైన వెల్లుల్లి సాధారణంగానే యాంటీ కాన్సర్ గా పనిచేస్తుంది. ఇక దీనికంటే 7 రేట్లు శక్తివంతమైన హిమాలయ వెల్లుల్లి  అంతర్గతంగా డయాలిల్ ట్రైసల్ఫైడ్ అనే ఆర్గానోసల్ఫర్ సమ్మేళనం కలిగి ఉంది, ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి శరీరానికి సహాయపడటం ద్వారా క్యాన్సర్‌తో పోరాడటానికి దోహాధం చేస్తుంది.  వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల 50% పైగా క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. 

 డయాబెటిస్‌తో పోరాడుతుంది

 2 నుండి 3 హిమాలయ  వెల్లుల్లి క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి మరియు నియంత్రించడానికి సహాయపడతాయి.  విటమిన్ బి మరియు థియామిన్‌లతో కలిసినప్పుడు అల్లిసిన్ ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.  ఇది మధుమేహంతో సమర్థవంతంగా పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది.

 గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటును నయం చేస్తుంది

 ఈ వెల్లుల్లి గుండె జబ్బులతో పోరాడటానికి రెండు విధాలుగా సహాయపడుతుంది.  ఒకటి ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది.  వెల్లుల్లిని తీసుకునే రోగులలో 20% తక్కువ చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. అలాగే  రెండవది, ఇది రక్తం యొక్క సాంద్రతను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది మరియు తద్వారా రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.  వెల్లుల్లిలో ఉన్న హైడ్రోజన్ సల్ఫైడ్ అనే రసాయన సమ్మేళనం దీనికి తోడ్పడుతుంది. 

చివరగా…..

హిమాలయ వెల్లుల్లి మన ప్రాంతాలకు సరిగా తెలియక పోయినా గొప్ప ఔషధ గుణాలను కలిగిఉంటుంది కనుక దొరికితే మాత్రం అసలు వదలకండి.

Leave a Comment

error: Content is protected !!