ప్రస్తుతం అందరి జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం వాతావరణ పరిస్థితులు లేదా శరీరంలో కలిగే మార్పులు కూడా కారణం అయ్యుండొచ్చు జుట్టు రాలడం సమస్య తగ్గించుకోవడానికి రకరకాల హెయిర్ ప్యాక్స్ ను ఉపయోగిస్తూ ఉంటాము. మన శరీరంలో కావలసిన విటమిన్స్ అండ్ మినరల్స్ లేకపోవడం వల్ల జుట్టు రాలుతుంది. మళ్లీ శరీరానికి కావల్సిన విటమిన్స్, మినిరల్స్ రావాలంటే మంచి ఆహారం తినాలి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల కొమ్ము శనగలు వేసుకోవాలి. కొమ్ము శనగలు ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. మలబద్దకం సమస్య తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్ ని మెరుగుపరుస్తాయి. శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. తర్వాత రెండు చెంచాల వేరుశనగలు తీసుకుని బౌల్ లో వేసుకోవాలి. వేరుశెనగలు శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది. ఐరన్ ఉండటం వలన శరీరంలో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడంలో సహాయపడతాయి.
తర్వాత దీనిలో 10ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. ఎండు ద్రాక్ష రక్తం పెరగడంలో సహాయపడుతుంది. డీ హైడ్రేషన్ ప్రాబ్లెమ్ ని తగ్గిస్తుంది. శరీరానికి ఐరన్,విటమిన్ సి లభిస్తాయి.ఈ మూడింటిని రాత్రి మంచి నీటితో కడిగి నానబెట్టుకోవాలి. ఉదయం లేవగానే వీటిని 2 భాగాలుగా చేసి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. గింజలను తిని నీటిని కూడా తినేయాలి. వీటిని నానబెట్టుకుని తినడం వలన మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఎటువంటి నొప్పులైనా తగ్గుతాయి.
నీరసం, అలసట, కళ్లు తిరగడం, ఎముకల బలహీనత, నరాల బలహీనత,రక్తహీనత, విటమిన్ లోపం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ గింజలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అన్ని లభిస్తాయి. దీనివలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇటువంటి ఆయిల్, హెయిర్ ప్యాక్స్ అవసరం లేకుండా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మందులు ఉపయోగించి కెమికల్స్ ఉన్న హెయిర్ ప్యాక్స్ ఉపయోగించి జుట్టు పెరిగేలా చేసుకోవడం కంటే ఇలా నాచురల్ పద్ధతిలో జుట్టు పెరగడం వలన ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి.
జుట్టు కుదుళ్ల నుండి బలంగా కూడా ఉంటుంది. ఈ రెండిటిని ఎక్కువ రోజులు కూడా చేయాల్సిన అవసరం లేదు. వరుసగా మూడు రోజులపాటు చేసినట్లయితే మంచి రిసల్ట్ ఉంటుంది. తేడాను మీరే గమనిస్తారు. ఈ గింజలు నాన పెట్టుకుని తినడం వలన చాలా రుచిగా ఉంటాయి.