శరీరంలో గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు పుల్లటి త్రేన్పులు వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి మనం తినే ఆహారం ముఖ్య కారణం. మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు, మాంసాహారం, జంక్ ఫుడ్, ఆహారం అధికంగా తినేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక చిట్కా చెప్పబోతున్నాను. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే గ్యాస్ బయటకు వెళ్ళిపోయి ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. దాని కోసం మనం నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలను అడ్డుకుంటుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది.
మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది అలాగే శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని కరిగించి అధిక బరువు సమస్యను నిరోధిస్తుంది. నిమ్మకాయను చిన్న ముక్కలుగా చేయాలి. స్టవ్వు మీద ఒక గ్లాస్ నీటిని పెట్టి దానిలో నిమ్మకాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత పదార్థం పుదీనా. ఒక చిన్న కప్పు మొత్తంలో పుదీనా ఆకులను ఈ నీటిలో వేసుకోవాలి. పుదీనా మంచి వాసనతో పాటు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. నోటి దుర్వాసనకు చికిత్స చేయడానికి పుదీనా ఉపయోగిస్తారు. పుదీనా నూనెలను వాసన పీల్చడం వలన మెదడు పనితీరు మరియు జలుబు లక్షణాలను మెరుగుపరుస్తుంది. దీన్ని చర్మానికి పూయడం వలన తల్లిపాలను ఇచ్చే బాలింతలలో చనుమొన నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఆహారంతో తీసుకోవడం వలధ IBS మరియు అజీర్ణం చికిత్సకు సహాయపడవచ్చు.
తర్వాత పదార్థం అల్లం అల్లం శరీరంలో అజీర్ణాన్ని తగ్గించి గ్యాస్, మలబద్ధకాన్ని తొలగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని చిన్న ముక్కలుగా లేదా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడు పదార్థాలు వేసిన తరువాత నీటిని బాగా మరిగించి మంట ఆపేసి నీటి మీద మూత పెట్టాలి. ఒక పది నిమిషాల తర్వాత ఈ నీటిని వడకట్టి రుచికోసం తేనె కలుపుకుని తాగవచ్చు. మధుమేహం ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. ఇది శరీరంలో గ్యాస్, ఎసిడిటీని తగ్గించడంతో పాటు అధిక బరువు సమస్యను తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. లివర్, కిడ్నీలు శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.