home made health drink for arthritis

ఈ పదార్థాలు ఉదయాన్నే నానబెట్టి తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కొలెస్ట్రాల్ షుగర్ యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గిపోతాయి

ఈ రెండు ఉదయాన్నే నాన పెట్టుకొని తినడం వలన షుగర్ అధిక బరువు కీళ్ల నొప్పులు,కొలెస్ట్రాల్  యూరిక్ యాసిడ్ తగ్గిపోతాయి  ఈ చిట్కా కి కావలసిన మొదటి పదార్థం కలోంజీ విత్తనాలు ఈ విత్తనాలు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.  వాతం, కఫం  తగ్గిస్తాయి.  కలోంజీ విత్తనాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయ సమస్యలు, కడుపులో సమస్యలను తగ్గిస్తాయి. శరీర మెటబాలిజం రేటు పెంచి కాలరీస్ తగ్గిస్తాయి. ఒబేసిటీ,వాత రోగాలను నయం చేస్తుంది.

రెండవ పదార్థం వాము. వాము కూడా వాతాన్ని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి తగ్గుతాయి.  జీర్ణాశయ సమస్యలు కూడా తగ్గిస్తుంది. శరీరంలోని   యూరిక్ యాసిడ్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.  గుండె చుట్టూ ఉండే కండరాలను బాగా పనిచేసేలా  చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను, మలినాలను శుభ్రం  చేస్తుంది. వాము వల్ల శరీరంలో  చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాము  పేగులనుశుభ్రం  చేస్తుంది. కడుపులో ఉండే సమస్యలు తగ్గిస్తుంది.   శరీర  మెటబాలిజంను బ్యాలెన్స్డ్గా   ఉంచుతుంది.

రక్తంలో ఉండే కొవ్వును తగ్గిస్తుంది. ఒక అర చెంచా కలోంజీ విత్తనాలు, అర చెంచా వాము తీసుకుని  చపాతీ పిండిలో వేసుకుని చపాతీలు చేసుకుని తినొచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. దానిలో అరచెంచా వాము, అరచెంచా కలోంజీ విత్తనాలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్లు అరగ్లాసు అయ్యేంతవరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని వడకట్టుకోవాలి. దానిలో ఒక స్పూన్ బెల్లం లేదా తేనె కలుపుకుని తీసుకోవాలి.

డయాబెటిస్ ఉన్నవారు బెల్లం, తేనె వేసుకోకుండా తీసుకోవాలి. ఒంట్లో వేడి బాగా ఎక్కువగా ఉన్నట్లయితే దీనిలో ములేతి పౌడర్ ఒక స్పూన్ వేసుకుని మరిగించుకోవాలి.ములేతి పౌడర్ వేడిని, వాతం తగ్గిస్తాయి. 15రోజుల పాటు ఈ టీ తగినట్లయితే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, యూరిక్ ఆసిడ్, ఒబేసిటీ,కొవ్వు కరిగించడంలో, వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో, జీర్ణ సమస్యలు తగ్గించడంలో, మంచి కొలెస్టరాల్ పెంచడంలో బాగా పని చేస్తుంది.

షుగర్ తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది. కడుపులో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ చిట్కా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. రాత్రి ఒక గ్లాస్ నీటిలో అర చెంచా వాము, అరచెంచా కలోంజీ విత్తనాలు వేసి నానబెట్టుకుని ఉదయం లేచి ఆ నీటిని చిన్న గుటకలు వేస్తూ మింగాలి. వాము, కలోంజీ విత్తనాలు తీసుకుని రోటీలో  వేసుకోవచ్చు. 

Leave a Comment

error: Content is protected !!