Home Remedies and OTC Options to Manage Pain

నెలసరిలో వచ్చే నొప్పి ఆపి…… ఆగిన నెలసరిని ఒక్క గంటలో వచ్చేలా చేసే అద్భుతమైన టిప్ప్………

                   కొంతమంది స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమయంలో వారు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ తీసుకోవడం గాని, డాక్టర్స్ దగ్గరికి వెళ్లడం గాని చేస్తారు. ఇలాంటి నొప్పిని డిస్మినోరియా అంటారు. ఈ నొప్పి ఎందుకు వస్తుంది అంటే చాలామంది స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కొంతమందికి చాలక ఇబ్బందులు వస్తే మరి కొంత మందికి ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన ఇబ్బందులు వస్తాయి. ఇలా ఎందుకు అవుతుంది అంటే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్లక్షేషన్స్ వచ్చి ఎక్కువైపోతూ ఉంటుంది.

                 జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన, హై కార్బో డైట్ ఎక్కువగా తీసుకోవడం వలన హార్మోన్  ఫ్లక్షేషన్స్ ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా శరీరంలో ప్రోస్టాగ్లాండీన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఏ మార్పులు వస్తాయి అంటే గర్భాశయంలో సంకోచాలు అనేవి ఎక్కువ అయిపోతాయి. ఇలా అతిగా ముడుచుకుపోవడం వలన నొప్పి విపరీతంగా వస్తుంది. బ్లీడింగ్ ఎక్కువ అవ్వడంతో పాటు నొప్పి ఎక్కువగా రావడానికి కారణం ప్రోస్టాగ్లాండీన్ అనేది ఎక్కువ ఉత్పత్తి కావడమే. ఈ నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కానీ అవి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి.

                      శాశ్వత పరిష్కారం ఏంటి అంటే హై ఫైబర్, లో కార్బో, లో ఫ్యాట్ డైట్. అంటే మొలకెత్తిన గింజలు, ఫ్రూట్స్, సలాడ్స్, జ్యూస్స్, ఆకు కూరలు. ఇలాంటి వాటికి ఎక్కువ అలవాటు పడాలి. ఇలా తీసుకోవడం వలన రెండు మూడు నెలల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం తగ్గిపోతుంది. కొవ్వు కూడా నాచురల్ గా తగ్గుతుంది. ప్రోస్టాగ్లాండీన్ అనేది ఎక్కువ ఉత్పత్తి కావడం పూర్తిగా తగ్గిపోతుంది. డైట్ ఇలా మార్చుకోవడం వలన శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

                   నెలసరిలో వచ్చే నొప్పి తాత్కాలికంగా తగ్గడానికి ఏం చేయవచ్చు అంటే ఏదైనా ఒక గుడ్డలో ఐస్ ముక్కలు వేసుకుని బాగా మడత పెట్టుకొని పొత్తికడుపు మీద ఐస్ ప్యాక్ పెడితే 20 నుంచి 25 నిమిషాల అలా ఉంచడం ద్వారా చల్లదనానికి నొప్పి తగ్గుతుంది. పెయిన్ కిల్లర్ లాగా ఐస్ ప్యాక్ పనిచేస్తుంది. ఇది రోజుకు రెండు మూడు సార్లు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు నాలుగు సార్లు కూడా చేయవచ్చు. కాబట్టి ఇలా చేయడం ద్వారా తాత్కాలిక  ఉపశమనం పొందవచ్చు…

Leave a Comment

error: Content is protected !!