ఒంట్లో వేడి ఎక్కువగా ఉంది అని మనకి తెలియడానికి ఈలక్షణాలు ఉంటే ఒంట్లో వేడి ఎక్కువగా ఉందని అర్ధం. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గొంతు నొప్పి,యూరిన్ ఇన్ఫెక్షన్ అవడం, యూరిన్ పాస్ చేసినపుడు మంటగా ఉండటం,యూరిన్ తక్కువగా అవ్వడం, నోటిపూత, కడుపు నొప్పి ఒంట్లో వేడి పెరగడానికి కారణాలు. ఒంట్లో నీటి శాతం తక్కువగా ఉండటం, జంక్ ఫుడ్స్ తినడం, కారం, మసాలాలు, నువ్వులు, ఖర్జూరాలు, గోంగూర, మటన్ వంటివి తినడం వల్ల ఒంట్లో వేడి ఎక్కువ అవుతుంది. పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల కూడా వేడి చేస్తుంది. టోన్డ్ మిల్క్, చిక్కటి పాలు తీసుకోవడం వల్ల కూడా వేడి పెరుగుతుంది.
దోసకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ వంటి నీరు ఎక్కువగా ఉండేవి తినడం వల్ల వేడి తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు, పంచదార కలిపిన నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, రాగి జావ, బార్లీ, పళ్లు వంటివి తీసుకోవడం వలన వేడి తగ్గుతుంది. రోజుకి 3 నుండి 4లీటర్ల నీళ్లు తాగడం వలన డీ హైడ్రేషన్ సమస్య పోతుంది. ఇంకా వేడి కూడా తగ్గుతుంది. రోజులో 3-4 లీటర్ల నీళ్లు తాగలేని వారు కొబ్బరి నీళ్లు, పంచదార కలిపిన నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, రాగి జావ, బార్లీ తాగొచ్చు. ఒంట్లో నీటి శాతం తగ్గినపుడు వేడి చేస్తుంది.
ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ఒంట్లో వేడి తగ్గుతుంది. ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నపుడు 3-5 లీటర్ల నీళ్లు తాగాలి. ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్లు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. రాత్రి సమయంలో ఎక్కువగా యూరిన్కి వెళ్లాల్సి వస్తుందని వాటర్ తక్కువగా తీసుకుంటారు. అలాంటపుడు పగలు ఎక్కువ నీళ్లు తాగుతూ రాత్రి సమయాల్లో వాటర్ తక్కువగా తీసుకుంటూ రాగి జావ, ఓట్స్ జావ, సూప్స్ తీసుకుంటూ ఉండాలి.
ఎండాకాలంలో డీ హైడ్రేట్ అయ్యి ఎలక్ట్రోలైట్స్ ఇన్బాలెన్స్ అవుతుంది. అప్పుడు ఉప్పు లేదా పంచదార కలిపిన నిమ్మరసం లేదా ఉప్పు,పంచదార కలిపిన నిమ్మరసం,కొబ్బరి నీళ్లు తాగడం వలన బాడీ వెంటనేే హైడ్రేట్ అవుతుంది. పుచ్చకాయ, మూసంబి, కమల, కివి వంటి వాటర్ ఎక్కువగా ఉండే పళ్లు ఎక్కువగా తినడం మంచిది. ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా తీసుకోవాలి. అల్లం పచ్చళ్లు, గోంగూర, మటన్, బయట ఆహారం, జంక్ ఫుడ్స్, నువ్వులు, ఖర్జూరాలు తినడం మానేస్తే ఒంట్లో వేడి తగ్గుతుంది.