Home remedies for child bed wetting

ఒక్క వయసు వచ్చినా సరే మీ పిల్లలు పక్కతడుపుతుంటే ఇది ఒక్కసారి తినిపిస్తే చాలు. తేడా మీరే చూస్తారు.

చిన్నపిల్లలు పక్క తడుపుతుంటే వారితో పాటు పెద్ద వారికి కూడా నిద్రాభంగం జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు బట్టలు వాసన, ఇన్ఫెక్షన్లు వంటివి ఉంటాయి. వీటిని నివారించడానికి చిన్న పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత పడుకోవడానికి ముందు మూత్రంకి వెళ్లేలా అలవాటు చేయాలి. అలాగే రాత్రి ఆరు తరువాత నీటిని తాగకుండా ఆపాలి. పడుకున్న తర్వాత రెండు సార్లు అయినా లేపి మూత్రం పోసుకునే అలవాటు చేయాలి. పిల్లలు ఇలా చేస్తున్న పక్క పైన మూత్రం పోస్తుంటే ఏదైనా విషయంగా భయపడుతున్నారు ఏమో గమనించాలి.

 పడుకోవడానికి ముందు భయపడే సీరియల్స్, సినిమాలు లాంటివి చూడకుండా ఆపాలి. పడుకునేటప్పుడు వాళ్లకి దైర్యం ఉండేలా మంచి కథలు చెబుతూ సౌకర్యవంతంగా పడుకోబెట్టాలి. ఇవన్నీ చేస్తున్నా వారు మూత్రం పోస్తుంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించడం వలన కొన్ని రోజుల్లోనే ఈ అలవాటు మానుకుంటారు. దానికోసం నల్ల నువ్వులు ఒక కప్పు తీసుకోవాలి. నల్ల నువ్వులను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో ఆక్సీకరణం తగ్గుతుంది, రక్తపోటును మెరుగుపరుస్తుంది మరియు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర మొక్కల రసాయనాలను అందించవచ్చు. 

నువ్వులలో పుష్కలంగా ఫైబర్ మరియు ప్రోటీన్‌ను అందిస్తాయి మరియు కాల్షియం, ఐరన్ మరియు జింక్ యొక్క మంచి మూలం. వీటిని శుభ్రం చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క ఇందులో వేసుకోవాలి. శరీరంలో బెల్లం ఐరన్ ని పెంచి రక్తహీనత, బలహీనతని తగ్గించి ఆరోగ్యంగా ఎదుగుతారు. ఇది దాని భేదిమందు గుణం కారణంగా మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది.  ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల దాని ఉష్ణ (వేడి) లక్షణం కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  

బెల్లం తినడం వల్ల పొటాషియం ఉండటం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అలాగే రాత్రుళ్ళు మూత్రం పోసే అలవాటును మానుకుంటారు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా దంచుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత ఈ లడ్డూను పిల్లలకు తినిపించాలి. ఇలా ప్రతిరోజు తినిపించడం వలన కొన్ని రోజుల్లోనే ఈ అలవాటును మానేస్తారు. ఎప్పుడైతే మూత్రం వేయడం ఆపేశారో అప్పుడు ఈ లడ్డూ ఇవ్వడం మానేయవచ్చు.

Leave a Comment

error: Content is protected !!