Home remedies for fast back pain relief

ఒక స్పూన్ నీళ్ళలో కలిపి తాగండి. ఎముకలు మధ్యలో గ్రీసు, గ్యాప్, వెన్ను నొప్పి, వాతరోగాలు జీవితంలో రావు.

శరీరంలో ఎముకలు మధ్య ఉండే లూబ్రికెంట్ ఎముకలు సులువుగా కదిలేలా చేస్తుంది అయితే మనం తినే ఆహారం మసాలాలు వంటి వాటితో నిండి ఉండడం వల్ల ఎముకలు మధ్య జిగురు అరిగిపోయి నొప్పి మొదలవుతుంది. అలాగే ఎక్కువగా నిలుచునే వారు, అధికంగా కూర్చునేవారు, అధిక బరువు సమస్యలతో బాధపడే వారు కూడా ఎముకల మధ్య జిగురు అరిగిపోయి ఎముకల నొప్పులు అనే సమస్య వస్తుంది. ఈ సమస్యకు అనేక రకాల మందులు వేసుకొని ఇతర ఆరోగ్య సమస్యలకు గురవ్వకుండా ఇంట్లోనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

 దాని కోసం మనం 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వాము, 50 గ్రాములు సొంటి తీసుకోవాలి. వీటన్నింటిని మెత్తని పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కలుపుకుని కావాలంటే బెల్లం పొడి కలుపుకొని తాగడం వలన శరీరంలో ఉండే అన్ని రకాల నొప్పులను తగ్గించి ఎముకల మధ్య జిగురు పెరిగేలా చేస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారు బెల్లం వాడకూడదు.  వాము యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వలన నొప్పి మరియు వాపును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 2016 అధ్యయనంలో పరిశోధకులు సొంటి మరియు ఎచినాసియా సప్లిమెంట్‌లు మోకాలి శస్త్రచికిత్స తర్వాత మంట మరియు నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తాయని కనుగొన్నారు. 

 ఒక 2001 అధ్యయనంలో పరిశోధకులు అల్లం సారం యొక్క అధిక సాంద్రత కలిగిన మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు.  మెంతి గింజలు అనేక యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలను అందించే ఫ్లేవనాయిడ్లతో సహా కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వాపును తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులు మరియు గాయాలను నయం చేయడానికి మెంతి గింజలను నేరుగా లేదా పౌడర్ రూపంలో ఉపయోగిస్తారు. వీటితో పాటు ప్రతి రోజు కనీసం శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. 

అలాగే పాలకూర, బెండకాయ వంటి పచ్చగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు, సొంటి కూడా కలిపి తాగవచ్చు. ఇది శరీరంలో వేడిని పుట్టించి నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఎప్పుడు చల్లని పదార్థాలను 6 దాటిన తర్వాత తీసుకోకూడదు. పండ్లు, డ్రై నట్స్ వంటివి తీసుకోవడం వలన సహజంగా ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Leave a Comment

error: Content is protected !!