Home remedies for hair growth and thickness for Black hair

ఉల్లిపాయలో ఈ పేస్టు కలిపి రాస్తే జుట్టు అసలు ఊడదు ఊడిన ప్రతి వెంట్రుక తిరిగి వస్తుంది

      ప్రస్తుతం అందరికీ ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వల్ల జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. దీనికోసం రకరకాల షాంపూలు ఆయిల్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి  వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంట్లో ఉండే వాటితో నాచురల్ పద్ధతిలో ఆయిల్ హెయిర్ ప్యాక్ వంటివి ట్రై చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. వీటిని ఉపయోగించడం వల్ల ఫలితం కూడా బాగుంటుంది. 

ఇప్పుడు జుట్టు రాలడం తగ్గించే అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని  పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక  స్త్రైనర్ సహాయంతో జ్యూస్ను వడకట్టుకోవాలి.  ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు మెంతులు రాత్రి నానబెట్టి పెట్టుకోవాలి. ఆ మెంతులను నానబెట్టి ఆ నీటితో సహా మెత్తగా మిక్సీ పట్టుకున్న  తర్వాత స్ట్రైనర్  సహాయంతో మెత్తటి పేస్ట్ ను  సపరేట్ చేసుకోవాలి.   

ఆనియన్ జ్యూస్ లోని  మెంతుల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత ఏదైనా షాంపూతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఒకసారి ఉపయోగించే సరికి తేడా మీరే గమనిస్తారు. ఆనియన్ జ్యూస్  జుట్టు రాలడం తగ్గించి కొత్త వెంట్రుకలు రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే తలలో ఉండే ఇన్ఫెక్షన్, చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

పేనుకొరుకుడు సమస్యతో బాధపడే వారు  ఆనియన్ జ్యూస్ అప్లై చేయడం వల్ల పేనుకొరుకుడు సమస్య  కూడా తగ్గుతుంది. మెంతులు కూడా జుట్టు రాలడాన్ని,  తలలో వేడిని, ఒత్తిడిని తగ్గిస్తాయి. మెంతులు ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా, షైనీగా తయారవుతుంది. మైల్డ్  షాంపు లేనప్పుడు కుంకుడుకాయ, శీకాకాయ వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు అయితే ఈ పేస్టులో రెండు చెంచాలు క్యాస్టర్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను వేసి కలుపుకోవాలి. ఇలా వారానికి ఒకసారి అప్లై చేయడం వలన జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!