Home remedies for hair growth with cast oil

జుట్టు ఊడిపోతుందా. ఒత్తుగా పెరగాలా అయితే ఈ రెండు పదార్థాలు ఉపయోగించండి చాలు

జుట్టు రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. జుట్టు మన అందం పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాంటి జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ మన జీవన విధానంలో వచ్చిన అనేక మార్పులు ప్రకృతి సహజంగా లభించే పదార్థాలకు దూరంగా అయిపోతుంది. 

ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనెతో చేసి తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు అందరికీ ఉండేది. కానీ ఇప్పటి కాలుష్యం, షాంపూలు, హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయాం. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తుంది. అందుకే ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టుని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం.

 జుట్టు రాలిపోవడానికి లేదా చాలా జుట్టు సాధారణ సమస్యలకు కారణం రక్తప్రసరణ సరిగ్గా జరగక పోవడం. దీనిని తగ్గించాలంటే తలకు మసాజ్ చేయడం మంచి పద్ధతి. అది నేచురల్గా దొరికే పదార్థాలు  ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది. దాని కోసం మనం ఇంట్లో ఆడించుకున్న లేదా ఆర్గానిక్ కొబ్బరి నూనె తీసుకోవాలి. దీనిలో ఆముదం నూనె కూడా తీసుకోవాలి.

 మనకు బయట దొరికే బాటిల్ నూనె కాకుండా ముడి ఆముదం చూడడానికి తేనె రంగులో ఉంటుంది దానిని తీసుకోవాలి. కొబ్బరి నూనె రెండు స్పూన్లు ఆముదం 1 స్పూన్ తీసుకోవాలి. దీనిని  డబుల్ బాయిలింగ్ పద్ధతి లో వేడి చేసి అంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి వేడెక్కాక ఇంకో గిన్నెలో ఆముదం కొబ్బరి నూనె నీటిలో పెట్టి అవి గోరువెచ్చగా అయిన తర్వాత కాటన్ బాల్స్ తో తలలోని కుదుళ్ళకు బాగా మసాజ్ చేయాలి.

 గోరువెచ్చగా ఉండేలా చూసి చర్మానికి ఈనూనె బాగా తగలాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగై జుట్టు ఊడటం తగ్గి పోతుంది. కొత్త జుట్టు రావడం కూడా మొదలవుతుంది. అలాగే ఎండినట్టు నిర్జీవంగా ఉండే జుట్టు కోసం రెండు కట్టలు మెంతి ఆకు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి రసం వచ్చేలా వడగట్టాలి. అందులో బాగా పండిన ఒక అరటిపండు వేసి మిక్సీ పట్టాలి.

 ఈ మిశ్రమాన్ని తలలో జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెత్తగా పట్టు కుచ్చులా తయారవుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల అరటిపండు, మెంతిఆకు వల్ల జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. కొత్త జుట్టు పెరుగుతుంది. ఈ రెండు చిట్కాలతో అందమైన, అద్బుతమైన జుట్టును పొందొచ్చు.

Leave a Comment

error: Content is protected !!