రోజువారీ పనిలో ఉన్నపుడో అసందర్భంగానో అకస్మాత్తుగా గొంతును ఒక పట్టాన నిలువనీయకుండా ఇబ్బంది పెట్టేవి ఎక్కిళ్ళు. ఈ ఎక్కిళ్ళు రాగానే పెద్ధోళ్ళు అంటుంటారు ఎవరో తల్చుకుంటున్నారు అని. ఎవరో తల్చుకోవడం మాట దేవుడెరుగు కానీ గొంతు నుండి శ్వాసకు తరువాత ఊపిరి తిత్తులు, అటు నుండి గుండె ఇవన్నీ కూడా ఈ ఎక్కిళ్ళ వల్ల ప్రభావితమవుతాయి, ఇబ్బంది పడతాయి.
ఊరితిత్తులు ఫ్రీనిక్ అనే నాడి, వేగస్ అనే నాడి, హైపోథాలమస్ అనే మెదడు భాగం, గొంతుకు సంబందించిన కొన్ని కండరాలు ఇవన్నీ కలిసి ఎక్కిళ్ళను సృష్టిస్తాయి.
సాధారణంగా వచ్చే ఎక్కిళ్ళు తొందరగా తగ్గిపోతుంటాయ్. కొన్ని నీళ్లు తాగడం,ఊపిరితిత్తుల గుండా గాలి పీల్చి బిగబట్టి నెమ్మదిగా వదులుతూ ప్రాణాయామం చేయడం వంటి వాటి ద్వారా కూడా కాస్త ఇబ్బంది పెట్టే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. అయితే కొన్నిసార్లు కొంతమందికి చిన్నగా మొదలయ్యి రోజులు మరియు వారాల తరబడి ఎక్కిళ్ళు వేధిస్తూనే ఉంటాయి. అసలు ఎక్కిళ్ళకు కారణాలు ఏమిటో చూద్దాం
◆ దిగులు, ఆందోళన, నిద్రపట్టకపోవడం వంటి కారణాలు
◆ ఈసోఫెగన్, గ్యాస్ట్రియంలో ఏర్పడే స్పందనలు ఎక్కిళ్ళకు కారణం కావచ్చు.
◆ బరువు తగ్గిపోవడం, మానసిక వత్తిడులు కూడా కారణాలు
◆శ్వాశ తీసుకునేటపుడు శ్వాశ నాళంలో గాలి చొరబడటం కూడా కారణం అవుతుంది
◆ ఎక్కువ నూనె, మరియు ఎక్కువ పులుపు కలిగిన పదార్థాలు ఎక్కిళ్ళను సృష్టిస్తాయి.
◆ ఆల్కహాల్, ధూమపానం, ఇతర మాధకద్రవ్యాలు
◆ జీర్ణశక్తి తగ్గిపోవడం కూడా ఎక్కిళ్ళకు కారణం
ఎక్కిళ్ళు తగ్గడానికి చిట్కాలు
◆ బార్లీ గింజలు ఉడికించి పెరుగు వేసి బాగా చిలికితే పలుచటి మజ్జిగలా అవుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి
◆ పెసరకట్టు లేదా కంది కట్టు ఎక్కిళ్ళను తగ్గిస్తుంది
◆ మాదీఫల రసాయనం తీసుకుంటే ఎక్కిళ్ళను తొందరగ తగ్గిస్తుంది.
◆ యోగ, ధ్యానం వంటివి చేయడం వల్ల శరీర అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఫలితంగా అసలు సమస్య రాకుండా చేసుకోవచ్చు.
◆ గ్లాసుడు లేత కొబ్బరి ద్వారా తీసిన పాలలో ఒక చెంచా అరగదీసిన గాంధాన్ని కలుపుకుని, దానికి కొంచం తీపి జోడించి తాగితే ఎక్కిళ్ళు ఆగుతాయి.
◆ మరమరాలు, జొన్న పేలాలు, బిరియాని ఆకు, వెలగ చెట్టు ఆకుల రసం. వీటన్నిటికీ ఎక్కిళ్ళను తగ్గించే గుణం ఉంది.
◆ ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటిని 100 గ్రాముల చొప్పున కొని మెత్తని చూర్ణంగా చేసి అందులో తగినంత ఉప్పు కలిపి నిల్వ చేసుకోవాలి. ఎక్కిళ్ళ సమస్య వేదిస్తున్నపుడు గ్లాసుడు మజ్జిగలో స్పూన్ ఈ పొడిని కలిపి తాగుతుంటే ఎంతటి తీవ్రమైన ఎక్కిళ్ళు అయినా తగ్గిపోతాయి. నరాలలో పెరిగిన వాతం తగ్గి, కడుపులో పైత్యం అణిచివేయబడుతుంది. అయితే మజ్జిగ పుల్లగా ఉండకూడదు.
చివరగా…..
ఎక్కిళ్ళు అనేది చిన్నగా కనిపించినా అది తీవ్రం అయితే ఛాతీ నుండి గొంతు వరకు ప్రతి భాగం చాలా నొప్పి మరియు అలసటకు లోనవుతుంది. ఒక్కోసారి కండరాలు పట్టేసి గుండె సమస్యలకు కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి పైన చెప్పుకున్న చిట్కాలను జాగ్రత్త చేసుకుంటే సమస్య వచ్చినపుడు మనకు రక్షగా ఉంటాయి.