Home Remedies for Open Pores Get Smooth Clear Skin

ఓపెన్ ఫోర్స్ నుంచి విడుదల అందించే మంచి నాచురల్ చిట్కా….. ఫేషియల్ గ్లో బాగా పెరుగుతుంది……

ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ అందరూ మేకప్స్ పై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. వాటిలో ఉండే కెమికల్స్ వలన మన చర్మం పాడైపోతుంది. అంతేకాకుండా ప్రకృతిలో వస్తున్న మార్పులు ద్వారా కూడా చర్మంపై మొటిమలు వస్తున్నాయి. అంతేకాకుండా చర్మం పై ఓపెన్ పోర్స్ ఉండిపోతూ ఉంటున్నాయి. మన చర్మం పై ఉండే స్వేద రంధ్రాలు ప్రకృతిలో వస్తున్న మార్పులు వలన కొన్నిసార్లు అవి తెరుచుకొని ఉండిపోతాయి. వీటిని ఓపెన్ పోర్స్ అంటారు. వీటి వలన ముఖం అందంగా కనిపించకుండా బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.  

                     వీటిని తగ్గించుకోవడానికి పార్లర్ చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటున్నారు. వాటి వలన తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది గాని శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అంతేకాకుండా ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటున్నారు. వీటి వలన కూడా ఫలితం ఉండటం లేదు. వీటిని తగ్గించుకోవడానికి ప్రకృతిలో లభించే వాటిని ఉపయోగించి ఓపెన్ ఫోర్స్ నుంచి విడుదల పొందవచ్చు. ఇది నాచురల్ కావున చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

                        దీనికోసం మనకు ముందుగా కావాల్సింది టమాటాలు. టమాటాలు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. టమాటాలు ఓపెన్ పొర్స్ లో ఉండే  బ్యాక్టీరియాలను, ఇన్ఫెక్షన్ ను తగ్గించడంతో పాటు చర్మం పై ఉన్న మురికిని మరియు జిడ్డును తొలగిస్తుంది. టమాటాలను తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను రెండు స్పూన్లు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ తేనెను కలుపుకోవాలి. తేనె మన చర్మాన్ని మాయిశ్చరైజర్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. తేనెలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ కూడా ఓపెన్ పోర్స్ ని క్లోజ్ చెయ్యడానికి సహాయపడతాయి.

                    ఈ రెండింటిని బాగా కలుపుకొని మన ముఖంపై అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు ప్యాక్ ను ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖం మీద స్క్రబ్ చేసుకుంటూ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న మృత కణాలు తొలగించబడతాయి. అంతేకాకుండా చర్మం పై ఉన్న ఓపెన్ పోర్స్ నాచురల్ గా క్లోజ్ అవ్వడానికి సహాయపడతాయి. తద్వారా మొఖం యవ్వనంగా కూడా కనిపిస్తుంది. ఇలా వారానికి రెండు మూడు రోజులు చేయడం ద్వారా ఫలితాలు కనిపిస్తాయి…

Leave a Comment

error: Content is protected !!