Home remedies for removing dark circles

కళ్ళకింద నల్ల మచ్చలకు మంగు మచ్చలకు ఇది రాశారంటే ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు

ఈ మధ్యకాలంలో ఫోన్లు, ల్యాప్టాప్లు వినియోగం ఎక్కువైపోయింది.అందరూ ఇంటికే పరిమితమవడం వలన ఆన్లైన్ క్లాసులు, ఉద్యోగాల వలన లేదా సరైన నిద్రలేకపోవడం వలన కూడా కంటి కింద నల్ల మచ్చలు ఏర్పడుతున్నాయి. సరైన నిద్ర , కంటికి విశ్రాంతి లేకపోవడం వలన కంటి కింద చర్మం దెబ్బతిని నల్లగా మారుతుంది. ముఖం ఒక రంగులో ఉంటే కళ్లచుట్టూ మాత్రం నల్లగా ఉండి ముఖం యొక్క కళను దెబ్బతీస్తుంది. 

దీనికి ఇంట్లోనే ఒక చిట్కా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్రా‌,  ఫోన్లు, ల్యాప్టాప్లు చూసేటప్పుడు కనీసం ఇరవై  నిమిషాలకొకసారి కంటికి విశ్రాంతిని ఇవ్వడంతో పాటు ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటిస్తే కంటికింది నలుపును , బుగ్గలపై వచ్చే మంగు మచ్చలు తగ్గించుకోవచ్చు. దాని కోసం మనం ఒక జాజికాయను తీసుకోవాలి. జాజికాయను మనం కేవలం మసాల దినుసుగా మాత్రమే చూస్తాం. కానీ దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

జాజికాయను బాగా దంచి మెత్తని పొడిగా చేసుకోవాలి. జాజికాయలో సహజంగా విటమిన్ ఇ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది డార్క్ సర్కిల్స్ మీద బాగా పనిచేస్తుంది.  తరువాత అలోవెరా జెల్ తీసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. దెబ్బతిన్న చర్మకణాలను సరి చేయడం లో కలబంద అద్భుతంగా పనిచేస్తుంది.  తాజా కలబంద లేదా మార్కెట్లో దొరికే కలబంద జెల్ ఏదైనా వాడుకోవచ్చు.

ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసి జాజికాయను పలుచని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిలో ఆయిల్ స్కిన్ ఉన్నవారు తప్ప మిగతావారు ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపి డార్క్ సర్కిల్స్ , మంగు ఉన్నచోట అప్లై చేయాలి. ఇది రాత్రి పూట రాసుకుంటే ఉదయం వరకు అలా ఉంచి ఉదయాన్నే శుభ్రం చేసుకోవచ్చు. పగటి పూట కనీసం గంట సేపు అయినా ఉంచుకుని తరువాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కనీసం నెలలో 10 రోజుల పాటు ఉపయోగించాలి. రోజు మార్చి రోజు అయినా లేదా పది రోజుల పాటు క్రమం తప్పకుండా అయినా ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!