Home Remedies For Removing Dark Circles simple remedy

రోజ్వాటర్లో ఇదొక్కటి కలిపి 3రోజులు రాస్తే కళ్ళకింద నల్లటి వలయాలు, వాపు, ముడతలు అన్నింటినీ శాశఱవతంగా తగ్గించుకోండి

కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక చిట్కా ప్రయత్నించి చూడండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. అసలు కంటి కింద బ్లాక్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అంటే పని ఒత్తిడి, నిద్రలేమి, శరీరానికి తగినంత నీరు తాగకపోవడం ఎక్కువగా టీవీ లేదా ల్యాప్ టాప్ , ఫోన్ చూడటం వంటివి కంటి కింద డార్క్ సర్కిల్స్ రావడానికి కారణమవుతాయి.

 వీటిని తగ్గించుకోవడానికి మనం 3 స్టెప్స్ తప్పక పాటించాలి. కనీసం ఏడు రోజులు ఈ చిట్కాలు పాటించడం వలన మంచి ఫలితం ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు కూడా మన ఇంట్లోనే ఉండేవి. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికోసం మొదట మనం తీసుకోవాల్సింది ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్.

 ఇది కళ్ళ కింద అప్లై చేయడానికి వచ్చేలా రోజ్వాటర్తో కలుపుకోవాలి. కొంతమందికి ఆరెంజ్ పీల్ పౌడర్ పడదు అంటే దానికి బదులు బాదం పౌడర్  తీసుకోవాలి. రెండు బాదం పప్పులను పొడి చేసి అందులో రోజ్ వాటర్ కలిపి అప్లై చేసుకోవచ్చు లేదు రోజు వాటర్ పడని వాళ్ళు కీరదోస జ్యూస్ వాడవచ్చు.

 ఆరెంజ్ పీల్ పౌడర్, బాదం పౌడర్ ఏదో ఒకటి తీసుకుని రోజ్వాటర్ని కలిపి కళ్ల కింద అప్లై చేయాలి. ఇది కనీసం 15 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత మామూలు వాటర్ తో ఇది తుడిచేయాలి. తర్వాత కీరా జ్యూస్ ని ఐస్ క్యూబ్గా మార్చుకొని దానిని ఒక క్లాత్ లో పెట్టి కంటి చుట్టూ సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. 

కీరా అందుబాటులో లేనప్పుడు ఐస్ క్యూబ్ తో చేసినా పర్వాలేదు. ఇలా మసాజ్ చేయడం వలన కంటి కింద నలుపు పోతుంది. కొంత మందికి కంటికింద ఉబ్బినట్లు ఉంటుంది. అది కూడా తగ్గుతుంది. ఐస్ క్యూబ్ మసాజ్ విడిగా ఉదయం, సాయంత్రం కూడా చేయవచ్చు. దీని వలన కంటి చుట్టూ నల్లధనం, ఉబ్బడం తగ్గుతుంది.

 ఇక మూడవ స్టెప్ కోసం అలోవెరా జెల్ ఒక స్పూన్ తీసుకొని అందులో  కొన్ని డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని కంటిచుట్టూ అప్లై చేసి అలానే వదిలేయాలి.

 ఇది చర్మంలో ఇంకి పోయి చర్మంపై ఉన్న నల్లధనాన్ని పోగొట్టి బ్లాక్ సర్కిల్స్ తగ్గిస్తుంది. ఆల్మండ్ ఆయిల్ అందుబాటులో లేనప్పుడు కొబ్బరినూనె కూడా వాడవచ్చు.ఈ మూడు స్టెప్స్  తప్పకుండా పాటించాలి. ఇందులో ఏదో ఒకటి చేయడం వలన అంతగా ఫలితం ఉండకపోవచ్చు. అలాగే కనీసం ఏడు రోజులు తప్పకుండా పాటించాలి.

 ఇవే కాకుండా గ్రీన్ టీ బ్యాగ్ వాడిన తర్వాత ఫ్రిజ్లో పెట్టి కళ్లపై పెట్టుకోవడం వలన వేడిని తగ్గించి కళ్లచుట్టూ నలుపు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే ఆల్మండ్ ఆయిల్ విటమిన్ ఇ క్యాప్సుల్ వేసుకొని కూడా వాడవచ్చు. ఈ మూడు స్టెప్ తప్పకుండా పాటించి మంచి ఫలితాలను పొందవచ్చు. దీనితోపాటు అసలు రావడానికి కారణాలను గమనించి అవి తగ్గించుకుంటే ఇంకా మంచి ఫలితాలను చూడవచ్చు.

Leave a Comment

error: Content is protected !!