home remedies for removing warts and skin tags

ఎన్ని చేసిన పులిపిర్లు పోవడం లేదా ఇది ఒకసారి రాస్తే మొత్తం పోతాయి, పులిపిర్లు తిరిగి మళ్ళీ రావు

శరీరం పైన ఎక్కడ పడితే అక్కడ పులిపిర్లు వస్తూ ఉంటాయి. పులిపిర్లు ఉండటం వలన నలుగురిలోకి  వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వాటిని పోగొట్టుకోవటం కోసం చాలామంది కత్తిరించడం, కాల్చడం వంటివి చేస్తారు. కానీ అలాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. పులిపిర్లు రావడానికి ఒక వైరస్ కారణము. ఆ వైరస్ చనిపోయేటట్లు  చేయడం వల్ల పులిపిర్లు పోతాయి. సూర్యుడి నుంచి వచ్చే యు.వి కిరణాలు  డైరెక్ట్ గా చర్మం పై  పడడం వలన కూడా పులిపిర్లు  వస్తాయి. ఈ చిట్కాలను ఉపయోగించడం వలన పులిపిర్లు పోతాయి. 

     తిరిగి మళ్ళీ జన్మలో రావు. దీని కోసం మనం ముందుగా నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న  వెల్లుల్లి రెబ్బల నుండి రసం వడకట్టుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత అరచెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపిన తరువాత చర్మంపై పులిపిర్లు ఎక్కడ ఉన్నాయో పులిపిర్ల మీద  కాటన్ తో లేదా ఏదైనా చిన్న క్లాత్ ముక్కతో ఈ మిశ్రమాన్ని పులిపిర్లు మీద మాత్రమే అంటుకునే లాగా అంటించాలి. 

       ఇది రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవాలి. ఇలా వరుసగా నాలుగు రోజుల పాటు అప్లై చేసినట్లయితే పులిపిర్లు రాలిపోతాయి. చర్మం లో పులిపిర్లు రావడానికి కారణమైన వైరస్ను కూడా చంపేస్తాయి. ఈ చిట్కా వలన  ఎటువంటి నొప్పి, బాధ, చర్మం డ్యామేజ్ అవ్వడం వంటివి లేకుండా పులిపిర్లు  తొలగి పోతాయి. చర్మం పై ఎక్కడపడితే అక్కడ వచ్చే పులిపిర్లను ఈ చిట్కా తో ఈజీగా పోగొట్టుకోవచ్చు.  పులిపిర్లు పోగొట్టుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి ఖర్చు లేకుండా పులిపిర్లను తొలగించుకోవచ్చు. 

   మీరు కూడా పులిపిర్లు సమస్యతో బాధపడుతున్నట్లైతే ఈ చిట్కాను ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ఉపయోగించినట్లయితే ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు.  పులిపిర్లు  తగ్గించడం కోసం ఉపయోగించిన మిశ్రమంలో   ఎటువంటి కెమికల్స్ ఉన్న పదార్థాలు లేవు కాబట్టి ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నాచురల్ పద్ధతిలో పులిపిర్లను ఈజీగా తొలగించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!