Home remedies for skin tag removal

ఇది రాస్తే ఒక్కరోజులో పులిపిర్లు ఎలా రాలిపోతున్నాయో చూడండి

ఇంట్లోనే ఉండే పదార్థాలతో ఇప్పుడు చెప్పబోయే చిట్కా ముఖంపై, మెడపై ఇతర శరీర భాగాలపై వచ్చే వార్ట్స్ను అంటే పులిపిర్లను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతాయి. అసలు పులిపిర్లు ఎందుకు వస్తాయి అంటే ఒక రకమైన వైరస్ వ్యాపించడం వలన పులిపిర్లు ఏర్పడతాయి. ఇది సర్వసాధారణం అయితే చాలామందికి ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. యుక్తవయసులో ఈ పులిపిర్లు ఎక్కువగా వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతివారిలోనూ ఈ పులిపిర్లు రావాల్సిన అవసరం లేదు.

 అయితే మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. సాధారణంగా పులిపిర్లుతో ఎటువంటి సమస్య ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం దురద, నొప్పి, రక్తం కారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. పులిపిర్లను కాల్చడం, కట్ చేయడం వంటివి చేయకూడదు. అలా చేయడం వలన వైరస్ చర్మం అంతా వ్యాపించి ఇంకా సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ పులిపిర్లు ఎక్కువగా చర్మం రంగులో ఉంటాయి. ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచి పులిపిర్లను తగ్గించే  చిట్కాలను తెలుసుకుందాం.

దంచిన వెల్లుల్లి పేస్ట్ లేదా ఉల్లిపాయ రసం లో స్పూన్ ఉప్పు కలిపి పులిపిరి ఉన్నచోట క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి. వెనిగర్లో నానబెట్టిన ఉల్లిపాయ లేదా నారింజ తొక్క పులిపిరి ఉన్నచోట పెట్టడం వలన మొదట్లో రంగుమారి తర్వాత వాటికి అవే రాలిపోతాయి. వీటితో పాటు పులిపిరి ఉన్నచోట ఆముదం పోసి దానిపై టేప్ అంటించి ఉంచడం వల్ల కొన్ని రోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి. అలాగే అరటి పండు తొక్క కూడా పులిపిర్లు రాలిపోవడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు అరటిపండును పులిపిర్లుపై రుద్దుతుంటే పులిపిర్లు రాలిపోతాయి. ఒక స్పూన్ కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి రాయడం వల్ల కూడా పులిపిర్లు తగ్గుతాయి. అలాగే కర్పూరం ఆయిల్ కూడా అందుబాటులో ఉంటే అది ఉపయోగించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. దంచి పెట్టుకున్న ఉసిరి గుజ్జు కూడా పులిపిర్లు అప్లై చేయవచ్చు. ఇది కూడా పులిపిర్లను రాలిపోవడానికి సహాయపడుతుంది. బంగాళదుంపను పులిపిర్లుపై రుద్దిన పులిపిర్లు రాలిపోతాయి. వీటితో పాటు తినే సున్నాన్ని పులిపిర్లుపై అప్లై చేయాలి. చుట్టుపక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్తగా పెట్టాలి. ఇలా ఇప్పుడు చెప్పిన చిట్కాలలో ఏదో ఒక దాన్ని కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల పులిపిర్లు వాటికవే రాలిపోతాయి.

Leave a Comment

error: Content is protected !!