home remedies for thyroid

ఎంత తిన్నా లావు కావట్లేదు…అసలు తినకపోయినా అధిక బరువు!! కారణం ఇదేనేమో…

కొందరు ఎలాంటి అతి ఆహారం తీసుకోకపోయినా లావుగా ఉంటారు. పాపం బరువున్నామని తినే కాసింత ఆహారంను తగ్గించి నోరు కట్టేసుకుని బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు ఎంత తిన్నా లావు కారు. ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తారు కానీ ఒక్కటి కూడా ఫలించదు. అలాంటి వారు ఒక్కసారి తెలుసుకోవలసిన విషయం థైరాయిడ్ సమస్య ఉందేమో పరీక్ష చేయించుకోవడం. 

అసలు ఈ థైరాయిడ్ ఏమిటి అంటే…….

గొంతు భాగంలో శ్వాశనాళాలకు ఇరువైపులా నిర్మితమైన వినాళ గ్రంధినే థైరాయిడ్ గ్రంధి అంటారు. థైరాక్సిన్ అనే హార్మోన్లను ఈ గ్రంధి విడుదల చేస్తుంది. అయితే ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ సక్రమంగా విధుడల కాకినాడ హెచ్చుతగ్గుల వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. శారీరక ఎదుగుదలకు దోహదపడే ఈ థైరాయిడ్ గ్రంధి శరీరానికి చక్కని ఆకృతిని ఇస్తుంది. శరీరంలో అవయవాలు తమ పనిని కచ్చితంగా చేయడంలో థైరాయిడ్ గ్రంధి ప్రాముఖ్యత ఎక్కువ. అటువంటి థైరాయిడ్ గ్రంధి వ్యవస్థ దెబ్బ తిని గొంతు వాపు రావడం తో మొదలయ్యి థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ విడుదల అయితే అనూహ్యంగా బరువు పెరిగిపోవడం. థైరాక్సిన్ హార్మోన్ తక్కువ విడుదల అయితే శరీరం సన్నబడి పీలగా మారిపోవడం జరుగుతుంది. 

పరిష్కారం

థైరాయిడ్ సమస్య వచ్చినవారు డాక్టర్ ను సంప్రదించి మందులు వాడినా, కొన్ని ఆహారపదార్థాలకు దూరముగా ఉన్నా, అవన్నీ తాత్కాలిక ఫలితాలను ఇస్తాయి. అయితే సొంత వైద్యం మంచిది కాదు ఎందుకంటే థైరాయిడ్ ఎక్కువ అవడం వల్ల 45 సంవత్సరాల పైన వయసు ఉన్నవారిలో ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు. అందుకే ఆరోగ్యవంతమైన పద్దతిలో థైరాయిడ్ ను పరిష్కరించుకోవడానికి ఆయుర్వేదంలో ఆసనాలు చక్కని పరిష్కారాన్ని ఇస్తాయి.

సర్వాంగాసనం, మత్స్యాసానం, భుజంగాసనం, వీరభద్రాసనం, చక్రాసనం మొదలైనవి థైరాయిడ్ సమస్యకు చక్కని పరిష్కారాల్ని ఇస్తాయి. ప్రతిరోజు వీటిని ఆచరించడం వల్ల థైరాయిడ్ సమస్య మాత్రమే కాదు, శరీరానికి చక్కని వ్యాయామం కూడా. 

ఒక అద్బుత రహస్య ఔషధం.

గొంతులో ఉన్న థైరాయిడ్ గ్రంధి సమస్యకు చక్కని పరిష్కారం మన స్వరంలోనే ఉందని ఎవరికి తెలియదు. మీకోసం ఆ రహస్యం. ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో పద్మాసనం లేదా వజ్రాసనంలో నిటారుగా కూర్చుని గుండెల నిండా గాలి పీల్చుకుని తిరిగి గాలిని వదిలేటపుడు “హం” అనే అక్షరం మన గొంతు నుండి ఉచ్చరించాలి. ఈ “హం” అనే అక్షరం బీజాక్షరం. ఇది కలిగించే వైబ్రేషన్ వల్ల గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి ఉత్తేజితమై అస్తవ్యస్తంగా ఉన్నది సక్రమమైన దారిలోకి వస్తుంది. ఈవిధంగా రోజు ఉదయం మరియు సాయంత్రం ఈ అక్షరాన్ని కనీసం 24 సార్లు  ఉచ్చరించినట్టైతే చక్కని పలితం మీ సొంతమవుతుంది. 

థైరాయిడ్ అనగానే ఇకమీద భయపదక్కర్లేదు…. అద్భుతమైన పరిష్కారం మనదగ్గర ఉందిగా…..

Leave a Comment

error: Content is protected !!