పంటినొప్పి మనల్ని పడుకోనివ్వదు. కూర్చోనివ్వదు ఒక్కసారి పంటినొప్పి వచ్చిందంటే పంటితోపాటు కన్ను, చెవినొప్పి, తలనొప్పికి కారణమవుతాయి. పంటిలో మూడు పొరలు ఉంటాయి. అవి ఎనామిల్, డెంటిన్, పల్ప్. పంటి పుచ్చు ఎనామిల్ లోపలికి వెళ్ళినప్పుడు పంటినొప్పి సమస్య ఉండదు.
మనం దానిని నిర్లక్ష్యం చేసినప్పుడు పుచ్చు డెంటిన్ లోపలి వెళుతుంది. అప్పుడు పంటి సెన్సిటివిటీ మొదలవుతుంది. దానిని కూడా నిర్లక్ష్యం చేసినప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోనపుడు పుచ్చు పల్ప్ని చేరుతుంది. అప్పుడు పంటినొప్పి మొదలవుతుంది. పంటినొప్పి రాత్రిపూట ఎక్కువగా వస్తుంది. పంటినొప్పి తగ్గడానికి కొన్ని ఇంటిచిట్కాలను చూద్దాం.
అందులో మొదటిది ఉప్పునీళ్ళు.
ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ నీటితో నోటిని పుక్కిలించాలి. ఉప్పులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు పంటినొప్పి ని తగ్గిస్తాయి.
లవంగం నూనె
లవంగం నూనెలో యుగేనాల్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం పంటినొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నూనెలో దూది ముంచి పంటినొప్పి వచ్చే చోట పెడితే పన్ను నొప్పి తగ్గుతుంది. లవంగం నూనె అందుబాటులో లేకపోతే లవంగం పెట్టినా సరిపోతుంది.
వెల్లుల్లి పేస్ట్
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయనం ఉంటుంది. అందుకే ఈ పేస్ట్ పంటిపై పెట్టినప్పుడు మంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం పేస్ట్
అల్లంలో జింజరాల్ అనే రసాయనం పంటినొప్పి తగ్గడంలో సహాయపడుతుంది. పంటిని బాక్టీరియా నుండి రక్షించడంలో తోడ్పడుతుంది.
అలాగే ఉల్లిపాయ రసం, తలకిందు ఎత్తు మామూలు కంటే కొంచెం ఎక్కువగా పెట్టడం చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొంతమందిలో చిగుళ్లు నుండి రక్తం కారుతుంది. అలాంటప్పుడు ఆముదం మరియు సాల్ట్ కలిపి పంటినొప్పి వస్తున్న చోట పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది.
ఇవన్నీ చేస్తున్న నొప్పి తగ్గడం లేదంటే వెంటనే కలవడం మంచిది. పంటి సమస్యలు వలన అనేక జీర్ణాశయ మరియు గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పంటి సమస్యలు ప్రారంభదశలో ఉన్నప్పుడే డాక్టర్ సలహాతో పంటిని కాపాడుకోవాలి.