మూత్రాశయం అతిగా స్పందించడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. మూత్రాశయ చర్యపై నియంత్రణ లేకపోవడం అసంకల్పిత మూత్రవిసర్జన యొక్క పరిస్థితులను కల్పిస్తుంది. తరచుగా ఇలా అనిపించడం వల్ల మన జీవనశైలి సమస్యగా మారవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు, మన రోజువారీ పనులకు అంతరాయం కలిగించవచ్చు. ఈ అతి మూత్ర సమస్య వల్ల సామాజిక సంబంధాలు కూడా దెబ్బ తింటాయి. జీవితంలో ఎన్నో అవకాశాలు కూడా కేవలం ఈ చిన్న సమస్య వల్ల చేజారిపోతాయంటే ఆశ్చర్యమేస్తుంది కూడా. కానీ ఇదే నిజం.
ఈ అతి మూత్ర సమస్య మూత్రాశయ ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు కూడా. ప్రశాంతమైన జీవితంలో ఒక కల్లోల్లం లాంటిది ఇది. దీనివల్ల నిద్రలేమి, నిద్రలేమి నుండి చిరాకు, అసహనం, కోపం వీటి వెంట డిప్రెషన్ ఇలా ఒకదాని వెంట ఒకటి చైన్ సిస్టం లా వస్తాయి. ఇన్ని సమస్యల వలయం లోకి వెళ్లకుండా అతి మూత్ర సమస్యను మొదట్లోనే నివారించుకుంటే!! అలాంటి నివారణోపాయాలు చెప్పడం కోసమే ఇపుడు ఈ సారాంశం. అతిమూత్ర సమస్యను సహజమైన పద్ధతుల్లో అందరికి దొరికే పదార్థాలతో నివారించుకునే చిట్కాలు మీకోసం మరి.
నువ్వు గింజలు
నువ్వుల గింజలలో ఖనిజాలు మూత్రాశయ పనితీరును నియంత్రణగా ఉంచడంలో గొప్ప క్రియాశీలక పదార్థంగా పనిచేస్తుంది.. తరచుగా మూత్రవిసర్జన సమస్యతో బాధపడుతున్న వారు నువ్వులు మరియు బెల్లం రెండింటితో రుచికరమైన లడ్డులు చేసుకుని తినడం ద్వారా అతి మూత్ర సమస్యను అధిగమించవచ్చు.
ఉసిరి
ఉసిరికాయ మూత్రాశయాన్ని క్లియర్ చేస్తుంది మరియు అసంకల్పిత మూత్రవిసర్జనపై నియంత్రణను మెరుగుపరచడానికి మూత్రాశయ కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. తక్షణ నివారణ కోసం తాజా ఉసిరికాయలను గ్రైండ్ చేసి స్వచ్ఛమైన రసాన్ని తీసుకోవాలి, దీనికి తేనెను కలిపి తీసుకోవాలి. అంతే కాదు ఇంకా మెరుగైన ఫలితం కోసం ఉసిరికాయ రసాన్ని పండిన అరటి పండు తో రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారమవుతుంది.
తులసి
మూత్రాశయ సంక్రమణ కారణంగా కొన్ని సందర్భాల్లో తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో మరియు మూత్ర విసర్జనను నియంత్రించడంలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదయాన్నే, 2 లేదా 3 తాజా ఆకులను దంచి ఒక చెంచా తేనెతో తీసుకోవాలి.
జీలకర్ర
జీలకర్ర మూత్రాశయం యొక్క విధులను క్రమబద్ధీకరిస్తుంది మరియు యుటిఐని కూడా నివారిస్తుంది. జీలకర్ర టీ రూపంలో తీసుకోవాలి. 1 టీస్పూన్ జీలకర్రను కచ్చాపచ్చాగా దంచి 2 కప్పుల శుభ్రమైన నీటిలో ఉడికించాలి. చల్లారిన తరువాత వడగట్టి సాధారణ టీకి బదులుగా రోజుకు రెండుసార్లు కొద్దిగా తేనెతో దీన్ని తాగవచ్చు. దీనివల్ల మూత్రాశయ అతి స్పందనలు తగ్గుతాయి.
కుంకుడుకాయ
జుట్టు సంరక్షణ లోనే కాకుండా తరచూ ఇబ్బంది పెట్టే మూత్ర విసర్జనను అరికట్టడంలో కూడా కుంకుడుకాయ ప్రభావవంతంగా పనిచేస్తుంది. కుంకుడుకాయ ను రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. తరచూ మూత్ర విసర్జన అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఆ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఒక వారం పాటు కుంకుడుకాయ నీటిని త్రాగాలి
చివరగా…..
అతిమూత్ర సమస్యతో ఇబ్బంది పడేవారు పై చిట్కాలను పాటించడం వల్ల తొందరగా ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు.