పైల్స్ ఉన్నవారిలో మలవిసర్జన అంటేనే భయం పట్టుకుంటుంది. వీరికి మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, రక్తస్రావం, మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. పైల్స్ లో నాలుగు రకాలు ఉంటాయి. మొదటి రెండు రకాలు మల విసర్జన సమయంలో బయటకు వచ్చి తర్వాత వాటికవే లోపలికి వెళ్లిపోతాయి. కానీ మిగతా రెండు రకాల్లో పైల్స్ బయటనే ఉండి విపరీతమైన నొప్పి, కూర్చోలేక పోవడం వంటి సమస్యలకు కారణమవుతాయి.
వీటికి కారణం సమయం సందర్భం లేకుండా ఆహారం తీసుకోవడం, నూనెలు, మసాలాలు ఎక్కువగా ఉండడం, జంక్ ఫుడ్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోకపోవడం,నీటిని సరైన మోతాదులో తాగకపోవడం వలన ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పైల్స్ సమస్య ఉన్నవారు ఎక్కువగా నీటిని తీసుకోవాలి. ఆల్కహాల్ ను మానేయడం చాలా చాలా మంచిది.
ఒత్తిడి, మానసిక ఆందోళనలు ఉన్న వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే వీలైనంత ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. లిక్విడ్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పైల్స్ సమస్య తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి నివారణ చిట్కాలను చూద్దాం. దీనికోసం మొదట ఒక ఉల్లిపాయను తొక్క తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్ ను వడకట్టి ఉల్లిపాయ రసం తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆముదం వేయాలి. పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక దూదిలోముంచి ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో అక్కడ రాసి గంట తరువాత కడిగేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేయడం వల్ల పైల్స్ మాడిపోయి రాలిపోతాయి. అలాగే తమలపాకుకు ఆముదం రాసి పైల్స్ ఉన్న చోట కట్టుకట్టడం వలన ఫైల్స్ రాలిపోతాయి. వాము, పసుపు సమాన భాగాలుగా తీసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకొని పైల్స్ పై అప్లై చేయడం వలన పైల్స్ తగ్గిపోతాయి.
క్యాబేజ్ ను మెత్తని పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ను మొలల పై అప్లై చేస్తే మొలలు రాలిపోతాయి. రోజు ముల్లంగి రసాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ మోతాదు పెంచడం వలన కొన్ని రోజుల్లోనే ఫైల్స్ రాలిపోతాయి. దానిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని తీసుకోవడం వలన మొలలు సమస్య తగ్గిపోతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పుల్లటి మజ్జిగలో పావు స్పూన్ కరక్కాయ పొడి వేసి కలుపుకుని తాగాలి.
ఇలా తాగడం వలన కొన్ని రోజుల్లోనే పైల్స్ రాలిపోతాయి. ఫైల్స్ సమస్య ప్రారంభదశలో ఉన్నప్పుడు ఈ చిట్కాలు పాటించడం వల్ల అవి పెద్ద అవకుండా రాలిపోవడానికి చాలా బాగా సహాయపడుతాయి. ఇందులో ఏదో ఒకటి క్రమం తప్పకుండా పాటించడం వలన పైల్స్ సమస్య శాశ్వతంగా నివారించబడుతుంది.