సహజంగా స్త్రీ పురుషుల మధ్య అందం విషయంలో ఎలాంటి వ్యత్యాసం లేకుండా జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బట్టతల అంటే ఎప్పుడో వృద్ధాప్యంలో చివరిలో వచ్చేది అనుకునేవారు. ఆధునిక జీవన శైలి, పర్యావరణ కాలుష్యము, మానసిక ఒత్తిడి, ఆందోళన ఇలాంటివి జుట్టు ఆరోగ్యం,అందంపై దుష్పరిణామాలు చూపిస్తూ ఉన్నాయి.
~జుట్టు రాలిపోడానికి, బట్టతల రావడానికి కారణాలు.!!
-స్నానం చేస్తున్న నీళ్లలో ఎక్కువ ప్రమాణంలో క్లోరిన్, బ్లీచింగ్ లాంటి కఠినమైన కెమికల్స్ ఉంటాయి. ఇవి జుట్టును పొడిబారెలా చేస్తాయి.
-జుట్టుకు సరిగ్గా నూనె రాయకపోవడం.
-పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం.
-మానసిక అశాంతి, నిరాశభావం, ఒత్తిడి జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణాలు.
-విపరీతమైన మెడిసిన్స్ తీసుకోవడం, దాని సైడ్-ఎఫెక్ట్స్ వల్ల జుట్టు పల్చబడిపోతుంది.
-అనీమియా, పిసిఓడి, థైరాయిడ్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా జుట్టు ఎక్కువ మోతాదులో రాలిపోతుంది.
-మార్కెట్లో దొరికే హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం, హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రైట్-నర్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడం.
-రేడియేషన్, కిమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ తీసుకునేవారీలో జుట్టు రాలుతుంది.-హార్మోన్స్ ఇంబ్యాలన్స్ వల్ల, కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉన్నా కూడా జుట్టు రాలిపోవడం,బట్టతలరావడం జరుగుతుంది.
సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ దగ్గర వెళ్ళడం మంచిది. దానికి ముందు ఇక్కడ ఒక్క చిన్న పరిహారం చూద్దాం.
రాత్రి రెండు స్పూన్ మెంతులను మంచి నీళ్లలో నానబెట్టి, ఉదయం మిక్సీలో వేసి మెత్తని ముద్దగా రుబ్బుకోవాలి..ఇలా మిక్సి పట్టిన పిండిని కొంచం కొంచమే నీరు వేసి జారుడుగా కలుపుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద ఇనుప కడాయి పేట్టిఅందులో రుబ్బుకొని, పేస్ట్ లాగా తయారు చేసిన పిండిని వేసి, కలుపుతూ ఉండాలి. మెంతులు బాగా ఉడికి చిక్కగా అయ్యేవరకు ఉడికించి చల్లారనివ్వండి. చల్లారిన మెంతి పేస్ట్ లేదా ప్యాక్ ఇందులో రెండు డ్రాప్ ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేసి, తలకు హెయిర్ ప్యాక్ లాగా వేసుకోండి.
అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసి లేత ఎండలో కురలు ఆరబెట్టుకోవాలి.
మెంతుల్లో బీటా కెరోటిన్ ఉంటుంది.
ఇందులో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్-బి కాంప్లెక్స్ ఎక్కువ ప్రమాణంలో ఉంటుది,ఇది జుట్టుకు కావాల్సిన పోషణ అందిస్తుంది. మరియు ఇందులోని ల్యావెండర్ ఆయిల్ జుట్టుకు మెరుపునిస్తుంది.
ఈ పరిహారం చేసుకున్నాక కూడా జుట్టు రాలుతుందంటే వైద్యసలహా తీసుకోవాలి.