కరోనా మళ్లీ తన పంజా విసరడం కూడా మొదలైంది. చాలా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో పని చేయడం తప్పనిసరి అయిన వారు బయట తిరగక తప్పడం లేదు. మామూలు జలుబు, దగ్గు వచ్చిన కరోనా ఏమో అని భయపడే పరిస్థితి జలుబు, దగ్గు ప్రారంభదశలో ఉన్నప్పుడు గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి ఈ గోల్డెన్ మిల్క్గా చెప్పుకునే పసుపు వేసిన పాలు చాలా ప్రాచుర్యం పొందాయి. మన అందరికీ తెలిసిందే పసుపులో ఉండే కర్క్యుమిన్ ఇన్ ఫెక్షన్లు తగ్గించి బ్యాక్టీరియాను నాశనం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఆరోగ్యం బలపడేలా చేస్తుంది.
అయితే ఇప్పుడు ఇంకో రెండు పదార్థాలతో కలిపి చేసుకునే.ఈ పాలు గొంతు ఇన్ఫెక్షన్ను తగ్గించి జలుబు, దగ్గు సమస్యను నివారించడంలో మనకు సహాయపడతాయి. అవి కూడా మనం బయటకు వెళ్లకుండానే మన ఇంట్లో ఉండే పదార్థాలు మాత్రమే ఉపయోగిస్తాం. ముఖ్యంగా మిరియాలు. నల్ల మిరియాలు మనందరం వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తుంటాం. బ్లాక్ పెప్పర్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీబయాటిక్ స్వభావం కలిగి ఉంటుంది, ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉంటుంది.
నల్ల మిరియాలను చూర్ణం చేసి, వాటిని ఒక టీస్పూన్ తేనెలో చేర్చడం ద్వారా జలుబును తగ్గించడానికి దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. మనం ఎప్పుడు మిరియాలను దంచి పెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, జీలకర్ర జలుబు మరియు దగ్గుకు అద్భుతమైన హోం రెమెడీ. జీలకర్రలోని సమ్మేళనాలు పట్టేయబడిన కండరాలను శాంతపరచడానికి మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
జీలకర్ర కూడా దంచి ఒక గ్లాసు పాలలో వేయాలి. జీలకర్ర, ఐదారు మిరియాలు పొడి, పావు స్పూన్ పసుపు వేసి పాలను బాగా మరిగించాలి.ఇందులో వేయవలసిన మరొక పదార్థం బెల్లంపొడి. పంచదార ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఇప్పుడు పాలు బాగా మరిగిన తరువాత వడకట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వలన గొంతు నొప్పి, మంట, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిపోతాయి. జలుబు, దగ్గు కూడా నివారించబడుతుంది. మధుమేహం ఉన్నవారు బెల్లం పొడి లేకుండా తాగడం మంచిది.