home remedies with tamarind seeds for joint pains

ఒక్కసారి తాగితే చాలు. నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళలో తిమ్మిర్లు, ఆర్థరైటిస్ నుండి శాశ్వతంగా ఉపశమనం

కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ముఖ్య కారణం ఎముకల మధ్య ఉండే గుజ్జు అరిగిపోవడం. ఇది అరిగిపోవటం వలన ఎముకతో ఎముక రాసుకొని నొప్పి వస్తుంది. వీళ్ళు పెద్దగా నడవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న, చిన్న పనులు చేసుకోవడానికి కూడా వేరొకరిపై ఆధారపడవలసి వస్తుంది. ఇలాంటి వారు ఆపరేషన్లు, మందులు అంటూ చాలా డబ్బులు వృధా చేస్తుంటారు.. కానీ ఈసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి. చాలా తక్కువ పదార్ధాలతో ఎముకల మధ్య ఉండే గుజ్జును పెంచే ఈ చిట్కా గురించి తెలుసుకోండి.

 దీని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు చింతగింజలు. అవునండి చింత గింజలే. చింత గింజల వలన మోకాళ్ల నొప్పులు ఎలా తగ్గుతాయి అనుకుంటున్నారా? చింతగింజల్లో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయని అని మీకు తెలుసా? చింతపండు గింజలు సాంప్రదాయ ఆయుర్వేద వైద్య చికిత్సలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

 చింతగింజల విత్తన పొడిని తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు మరియు ఆర్థరైటిస్‌కు చికిత్స లభిస్తుంది.  చింతపండు విత్తనాలు కీళ్ళలో మంట మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని అనేక ఫరిశోధనల్లో రుజువయింది. ఇవి కీళ్ళలో నొప్పి తగ్గడానికి కూడా సహాయపడుతాయి మరియు ఎముక మరియు వాటిమధ్య మృదులాస్థిని కాపాడుతుందని ప్రారంభ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. 

ఈ గింజలను కడిగి నీడలో ఆరబెట్టి తర్వాత వేయించి పైన తొక్క తీసేసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. చింతగింజలు అందుబాటులో లేనివారు చింతగింజల పొడి దొరుకుతుంది అది తీసుకోవాలి. తర్వాత సబ్జావిత్తనాలను రెండు చెంచాల వరకూ నానబెట్టాలి. పదినిమిషాల్లో ఇవి ఉబ్బుతాయి. వీటివలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 కీళ్ళనొప్పులకు మరోకారణం అధికబరువు. సబ్జావిత్తనాల అధికబరువును తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. తర్వాత  ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని చెంచానర చింతగింజల పొడి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపి అందులో సబ్జావిత్తనాలను కూడా వేసుకోవాలి.

 తర్వాత రుచికోసం తేనె కలుపుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె వాడకపోవడమే మంచిది. ఇందులో రెండు తులసి ఆకులను కూడా వేసుకుని ఉదయాన్నే పరగడుపున తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇలా ఈ డ్రింక్ తాగడంవలన ఎముకల మధ్యలో గుజ్జు పెరుగుతుంది. ఆర్థరైటిస్, కీళ్ళనొప్పులు తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగాలి. ఇలా తాగడం వలన ఎంత వయస్సు వచ్చినా కీళ్ళనొప్పులు, నడుంనొప్పి వంటివి దరిచేరవు.

Leave a Comment

error: Content is protected !!