ఈ రోజుల్లో పటికబెల్లం అంటే చాలా మందికి తెలియదు పూర్వంరోజుల్లో అందరికీ ఏదైనా కాలక్షేపానికి, పిల్లలు ఏడుస్తుంటే, తినాలని కోరినపుడు పటిక బెల్లం ముక్క ఇచ్చేవారు. ఈరోజుల్లో పిజ్జాలు లేదంటే చాక్లెట్లు ఐస్క్రీములు అలవాటయి పురాతనంగా ఎప్పటి నుంచో వచ్చే ఆహారాలు మరుగునపడ్డాయి. చాలా మందిలో పటికబెల్లం తినే అలవాటు ఉంటుంది. ఇప్పటికే కొంతమంది దగ్గు వచ్చేవారికి అలవాటు ప్రకారం నోట్లో పటికబెల్లం పెడతారు.
నిజంగా ఇది పనిచేస్తుందా లేదా మనకి అవగాహన కావాలి. పటికబెల్లం ఎలా తయారు చేస్తారు. పంచదార నీళ్ళు పోసి పోయ్యి మీద పెట్టి మరిగించి పాకం రావాలి. అలాగే పంచదార చిక్కగా అయిన తర్వాత దానిని ప్లేట్ లోకి పోసి మందంగా ఉంటుంది కాబట్టి ముక్కలుగా కోసి అమ్ముతారు. అప్పటికాలంలో దాన్ని ఇంట్లో అరకేజీ అలా తెచ్చి పెట్టుకునేవారు. చాలామంది చిన్న పిల్లల్లో దగ్గు తగ్గటానికి పనికొస్తుంది అంటారు. చిన్న పిల్లలకు దగ్గు వచ్చినప్పుడు చూడండి నిద్ర ఉండదు .
దగ్గుకి గొంతు నుండి పొట్ట,ఛాతీ భాగాలన్నీ నొప్పులు వస్తాయి. కొంతమంది చంటి పిల్లలు అయితే ముఖ్యంగా తెల్లవారుజామున లేచి కూర్చుంటారు.ఇంట్లోవాళ్ళందరి నిద్ర కూడా పోతుంది . వాళ్ళ ఇబ్బంది చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో సుఖంగా నిద్రలేకుండా చేస్తున్న టానిక్కులు అవీ ఉండేవి కాదు. మరి ఏదైనా పసరుమందు వాడినప్పటికీ ఫలితం తక్కువ.
ఈరోజు ఎంత టానిక్కులు వాడినప్పుడు కూడా అలాంటి వారికి నోట్లో పటికబెల్లం పెట్టి తగ్గుతుంది అని చెప్పేవారు. ఆ రోజుల్లో డాక్టర్ లేడు కదా. మనసులో నమ్మకం పెట్టుకొని నోట్లో పటికబెల్లం పెట్టి తగ్గిపోయేది. అప్పట్లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా పంచదార తింటే అది ఎక్కువ అయిపోతుంది . అదే మరి దీన్ని ఇంకా మరగబెట్టీ చేస్తారు అయినందుకు ఇంకా అందులో హాని కలిగించే కెమికల్స్ వల్ల పటిక బెల్లం వల్ల అసలు వాడకూడదు.
త్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు, నోటి ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ పటిక బెల్లం పెడితే దగ్గు పంచదార కంటే ఇంకా ఎక్కువ అవుతుంది కదా .ఈ అనుమానం మీకు వచ్చిందా. అప్పుడు రోజుల్లో అందరి దగ్గర డబ్బులు ఉండేవికాదు కదా . అందుకే చిరుతిండ్లు తక్కువగా తినేవారు. అలాంటి పిల్లల్లో ఈ పటిక నోట్లో పెడితే చాలా బాగుంటుంది.
దాంతో మానసిక ఆనందం పొంది త్వరగా కోలుకునేవారు తప్పా కొంతమంది పాలలో కలిపి తాగిస్తే మంచిది జ్యూస్లో పటిక బెల్లాన్ని పొడి చేసుకొని తాగితే మంచిది అని చాలా మంది అంటుంటారు అని మీరు కూడా వాడకండి. దీనికంటే స్వచ్ఛమైన తేనె, ఖర్జూరాలపొడి, బెల్లం వాడడం మంచిది