ayurvedic home remedy for joint pains

కేవలం ₹ 3 లతో మీ నడుం,మోకాళ్ళ నొప్పి,చేతులు,కాళ్ళు,వెన్ను నొప్పిని మాయం చేసే ఆయుర్వేద చిట్కా

ఒకప్పుడు మనుషులు తినే తిండి, చేసే పనుల కష్టం వలన శరీరం ధృడంగా ఉండేది. పెద్ద వయసు వచ్చేంతవరకూ ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకునేవారు. కానీ ఇప్పటి వాతావరణంలో మార్పులు, తినే తిండి, శరీరానికి వ్యాయామం లేకపోవడంతో చాలా చిన్న వయసులోనే కీళ్ళు, కాళ్ళ నొప్పులు, శరీరంలో భుజాలు, కాళ్ళు, చేతులు, నడుము, వెన్ను నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నొప్పులకు కారణం ఎముకల మధ్యలో ఉండే మెత్తని గుజ్జు లాంటి పదార్థం అరిగిపోవడం లేదా ఆర్థరైటిస్. దీనికి విరివిగా మందులు వాడడం వలన శరీరంలో ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆయుర్వేదంలో గమనిస్తే మన ఇంట్లో ఉండే దినుసులుతోనే కీళ్ళనొప్పులకు ఉపశమనం లభిస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

అందులో ముఖ్యమైనది జాజికాయ. జాజికాయ లేదా జైఫాల్ ఒక విత్తనం, దీనిని సాధారణంగా మసాలాగా ఉపయోగిస్తారు.  జాజికాయను మిక్సీలో వేసి పొడిచేసి అందులో అరస్పూన్ పసుపు, రెండు, మూడు స్పూన్ల ఆవనూనె వేసి బాగా కలపండి.ఇది కొంచెం జారుగా ఉండే మిశ్రమంలా ఉండేలా చేసి నొప్పులు ఉండేచోట రాయాలి.  జాజికాయ దాని యాంటిడిప్రెసెంట్ కారకాల కారణంగా ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది.  మీ రెగ్యులర్ డైట్‌లో మసాలాగా తీసుకోవడం వలన జీర్ణక్రియను పెంచుతుంది.  అంతేకాక పూర్వం నుండి పిల్లలలో విరేచనాలు మరియు గ్యాస్ ను తగ్గించడానికి జాజికాయను ఇంటి నివారణ చిట్కాగా ఉపయోగిస్తున్నారు.  

ఇది కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం ఇస్తుంది. జాజికాయ నిద్ర బాగా పట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించే అనేక ఆయుర్వేద మందులు మరియు సూత్రీకరణలలో భాగంగా జాజికాయను విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్త్రీలలో సంతాన సామర్థ్యం పెంచి,  పురుషులలో వీర్యవృద్దికి సహాయపడుతుంది. కీళ్ళనొప్పులు తగ్గించడంలో పసుపు చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని కలిగించి ఉపశమనం ఇస్తుంది. అలాగే ఆవనూనె తో మసాజ్ చేయడం వలన కూడా నొప్పులు తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వాడడం వలన మీరే ఆశ్చర్యకరమైన ఫలితాలు చూస్తారనడంలో అతిశయోక్తి లేదు.

Leave a Comment

error: Content is protected !!