చాలామంది మెడ కాళ్లు చేతులు వంటి భాగాల్లో నల్లగా అయిపోయిందని తగ్గించుకోవడం కోసం పార్లర్కు వెళ్లి బ్లీచ్ పెట్టించుకుంటారు. బ్లీచ్ పెట్టించుకునే అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే టాన్ పోగొట్టుకోవచ్చు. బ్లీచ్ లేదా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా నాచురల్ పద్ధతిలో నలుపు మొత్తం పోగొట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా బంగాళదుంపను తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి.
కట్ చేసిన బంగాళదుంప మీద చాక్ లేదా ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి. దీనిపైన కొంచెం బేకింగ్ సోడా వేసి నల్లగా అయిన భాగంలో ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. దానిలో ఒక చెంచా కాఫీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని నల్లగా అయిన భాగంలో అంటే కాళ్ళు చేతులు మెడ చంకలు గిలకలు వంటి భాగాలలో అప్లై చేసి పది నిమిషాల పాటు నాననివ్వాలి.
తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. వారంలో రెండు లేదా మూడు సార్లు ఇలా చేయడం వల్ల మీ చర్మం పై ఉండే టాన్ మొత్తం పోతుంది. బంగాళదుంప మరియు బేకింగ్ సోడా నాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. ఇవి ఎంత పేరుకుపోయిన మురికి నైనా సరే ఈజీగా పోగొడతాయి. అలాగే పెరుగు కూడా నల్లగా మారిన చర్మం తెల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
కాఫీ పౌడర్ లో ఉండే కెఫిన్ అనే పదార్థం చర్మఛాయ మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. పార్లర్ కి వెళ్ళనవసరం లేకుండా వేలకు వేలు ఖర్చుపెట్టే అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే మీ చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, మురికి, సన్ టాన్ వంటి వాటిని తగ్గించుకోవచ్చు. చర్మంపై కెమికల్స్ ఉండే బ్లీచ్ మరియు క్రీములు పూసుకోవడం కంటే ఇలా నాచురల్ పద్ధతిలో నలుపును పోగొట్టుకోవడం మంచిది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని వయసుల వారు అన్ని స్కిన్ టైప్స్ వారు ఉపయోగించుకోవచ్చు. ఈ చిట్కా మీరు కూడా ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.