ఆడవారికి తలకట్టే అందం. మగవారికి కూడా అనుకోండి. కానీ వాయుకాలుష్యం, నీటి కాలుష్యంతో ఒకప్పుడు బారెడు జడలు ఉన్నవారు కూడా నేడు పలచగా అయిపోతున్న జుట్టును చూస్తూ కలతపడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే చిట్కాలతో ఇకపై జుట్టు రాలడం అనే సమస్య నుండి విముక్తి పొందవచ్చు. పోషకాహార లోపం, నాణ్యత లేని నూనెలు, రసాయనాలతో నిండిన ఖరీదైన షాంపూలు కాకుండా మన ఇంట్లో ఉండే ఈ పదార్థాలను వాడి ఒకప్పటి తలకట్టు సొంతం చేసుకుందాం.అవేంటో ఎలా వాడాలో తెలుసుకుందాం రండి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకుని దుమ్ము, రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకుని అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇరవై నిమిషాలు నానిన తర్వాత బియ్యం బాగా కడిగి ఆ నీటిని తీసుకుని వడకట్టుకోవాలి. ఈ నీటిని తలకు వాడడం వలన ఈ నీటిలో ఉండే ఇనోసిటాల్, కార్బోహైడ్రేట్లు జుట్టు సమస్యలైన చిట్లడం, తెగిపోవడం, పొడిబారడం నుండి జుట్టును బాగుచేస్తాయి. ఈ నీటిని జుట్టుకు నేరుగా వాడొచ్చు. ఈ నీటిలో ఉండే ph లెవల్ జుట్టు కంటే ఎక్కువ ఉండడం వలన జుట్టుకు పొరలా ఏర్పడి చిట్లకుండా, పొడిబారకుండా కాపాడతాయి.
ఇంకా మంచి ఫలితాల కోసం ఈ నీటిన పులియబెట్టాలి. ఇది మన జుట్టుకు మరింత పోషణను ఇస్తుంది. పులియబెట్టడం వలన పిటేరా అనే రసాయనం తయారయి విటమిన్లు, ఖనిజాలు, అమైనో యాసిడ్స్, పోషకాలతో నిండి ఉండి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ నీటిని జుట్టుకు పెట్టడంవలన కండిషనర్లా కూడా ఉపయోగపడుతుంది. దానికోసం స్నానం చేసిన తర్వాత తలకి పట్టించి ఐదునిమిషాలు తర్వాత కడిగేస్తే మంచి కండిషనింగ్ చేస్తుంది.
రాలే సమస్య కోసం అయితే ఈ నీటిని మీ తలకు సరిపడా తీసుకుని అందులో కొబ్బరి లేదా మీకు నచ్చిన ఆలివ్, బాదం ఆయిల్ ను కలిపి తలలో కుదుళ్ళకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. అలాగే చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యలకు బియ్యం నీటిని తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఆ సమస్యలు తగ్గి రెట్టింపు వేగంతో జుట్టు పెరుగుతుంది.