Home Remedy to Remove Unwanted Hair

ఇంట్లోనే ఈ చిట్కా తో ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలు పోతాయి

 ప్రస్తుతం  అందరికీ ఉండే  సమస్య  అవాంఛిత రోమాలు. ముఖంపై పెదవుల దగ్గర గడ్డం మీద చేతులు మీద బయట కనిపించే చోట ఉండటంవల్ల బయటకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.  అవాంచిత రోమాలు ఎటువంటి వాక్స్  లేకుండా ఈజీగా ఈ చిట్కాతో ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.  దీనికోసం కావలసిన పదార్థాలు గోధుమపిండి, పంచదార, తేనె.  ఒక గిన్నె తీసుకొని  మనకు కావలసినంత గోధుమపిండి అంటే మనకు అవసరమైనంత   గోధుమ పిండి వేసుకోవాలి. దానిలో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి.

కొంచెం వాటర్ లేదా రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి.  ఈ మిశ్రమం బాగా పలుచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియం గా ఉండాలి. గోధుమ పిండి లో గ్లూటాన్  ఉండడం వలన అవాంఛిత రోమాలను  పట్టుకొని ఉంటుంది దీనివలన అవాంఛిత రోమాలు రాలిపోతాయి. పంచదార కార్మలైజ్ చేసి   నేచురల్ వాక్స్ లాగా పనిచేస్తుంది.  తేనె  చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది  20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత పీల్ చేయాలి.

లేదా కొంచెం వాటర్తో  చేయి తడి చేసుకొని  నెమ్మదిగా స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేసుకోవాలి. ప్యాక్ తీసేసిన తర్వాత అలోవెరా జెల్ లేదా మోయిశ్చరైజర్ లేదా ఏదైనా ఆయిల్ అప్లై చేసుకుని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన అవాంఛిత రోమాలు రాలిపోతాయి వారానికి ఒకసారి లేదా 10 రోజులకి ఒకసారి చేయడం వలన అవాంఛిత రోమాలు రావడం కూడా తగ్గుతుంది. పార్లర్కి వెళ్ళనవసరం లేకుండా  వాక్స్ అవసరం లేకుండా ఇంట్లోనే  నాచురల్ ఇంగ్రిడియంట్స్తో  అవాంచిత రోమాలు  తీసేయవచ్చు.

ఆ  చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని పెసలు తీసుకుని బరకగా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ గ్రైండ్ చేసిన పెసలు తీసుకోవాలి. దీనిలో  ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా పలుచగా, బాగా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉంటే కొంచెం పాలు వేసి మీడియంగా ఉండేలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని అవాంఛిత రోమాలు ఉన్న చోట అప్లై చేసి ఆరిన తర్వాత నెమ్మదిగా స్క్రబ్  చేస్తూ రిమూవ్ చేసుకోవాలి. పెసలు జిగురుగా ఉండటం వలన అవాంఛితరోమాలు రాలిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది. తేనె మరియు పాలు చర్మాన్ని మోయిశ్చరైజ్ చేసి చర్మాన్ని స్మూత్గా చేస్తుంది. 

Leave a Comment

error: Content is protected !!