home Tips to Clear Blood Clots Naturally

2రోజుల్లో తలనుండి పాదాలవరకూ మూసుకుపోయీన రక్తనాళాలు తెరుచుకుంటాయి.

మీకేమయినా గుండె సమస్యలు ఉన్నాయా.లేదా గుండెపోటు వస్తుందని భయపడుతున్నారా. ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటిస్తే జీవితంలో ఎలాంటి గుండెసమస్యలు తలెత్తవు. ఈ చిట్కా పూర్తిగా ఆయుర్వేదిక్.దీనివలన మీ రక్తనాళాలు పూర్తిగా శుభ్రపడిపోతాయి. ఇంట్లో నీళ్ళు వచ్చే పంప్ సరిగ్గా పనిచేయకపోతే ప్లంబర్ని పిలిచి సరిచేయిస్తాం. అప్పుడు మళ్ళీ ప్రెజర్ వచ్చి నీళ్ళు బాగా వస్తాయి. అలాగే మన శరీరంలో కూడా జరుగుతుంది. నీళ్ళు రావడానికి పైప్లు ఎంత అవసరమో శరీరంలో రక్తం సరఫరా అవడానికి రక్తనాళాలు కూడా అంతే అవసరం. 

మన శరీరంలో రక్తం తీసుకెళ్ళడానికి రక్తనాళాలు పనిచేస్తాయి. ఇంట్లో నీళ్ళట్యాంక్ నుండి నీరు సరఫరా అయినట్లుమన శరీరంలో గుండె నుండి రక్తం సరఫరా అవుతుంది. మనం తినే తిండివలన చేరిన మలినాలు గుండెలో చేరుతాయి. రక్తంలో ఉండే ఈ మలినాలు రక్తనాళాల్లో చేరి పేరుకుపోతాయి. దానివలన ఇవి మన రక్తనాళాలను కొద్ది కొద్దిగా మూసివేస్తాయి. దీనివలన ఏదొక రోజు మన గుండె సడెన్గా కొట్టుకోవడం ఆగిపోతుంది. రక్తంలో కలిసిన మలినాలు వలన శరీరంలో వందకు పైగా రోగాలు వస్తాయి.

 రక్తప్రసరణ సరిగా జరగదు. దీనివలన మిగతా అవయవాలకు రక్తం సరిగా అందదు.  ఆక్సిజన్ సరిగ్గా అందక అవయవాల పనితీరు కుంటుపడుతుంది. ఇలా జరగడంవలన  కిడ్నీలకు రక్తం సరిగా అందక కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేయలేవు. వెంట్రుకలకు రక్తప్రసరణ జరగకపోతే వెంట్రుకలు రాలిపోవడం,చిట్లిపోవడం జరుగుతుంది. మీకళ్ళకు సరిగ్గా రక్తప్రసరణ జరగకపోతే మీకళ్ళపై ఒత్తిడి కలిగి కంటిచూపు తగ్గిపోతుంది. తలనొప్పి వస్తుంది. ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే అలసటగా ఉంటుంది. 

చేసే పనిపైన శ్రద్ధ పెట్టలేరు. మెదడుకు రక్తం సరిగా అందకపోతే దేనిపైనా ఏకాగ్రత కుదరదు. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. చూసారా రక్తనాళాల్లో ఏర్పడే సమస్య ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో . అందుకే రక్తనాళాలపై శ్రద్ధ పెట్టి వాటిని శుభ్రపరుచుకోవాలి ఇలా చేయడం వలన ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఈ చిట్కా ఉపయోగించండి. మీ రక్తం శుభ్రపరచడానికి , గుండెలో బ్లాకెజ్లు ఏర్పడకుండా ఉండడానికి మీకు నాలుగు పదార్థాలు కావాలి.

 అవేంటంటే. సొరకాయ, కొత్తిమీర, పుదీనా, తులసిఆకులు. ఆయుర్వేదంలో ఈ నాలుగు పదార్థాలను అద్బుతమైన ఔషధాలుగా భావిస్తారు. దీనికోసం ఒక గ్లాసు సొరకాయ రసం తీసుకోవాలి. ఇందులో పదిరెమ్మల కొత్తిమీర, పదిరెమ్మల పుదినా, మరియు పది తులసి ఆకులు వేయాలి. వీటన్నింటిని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టాలి. తులసిని మన దేశంలో అమ్మతో సమానంగా చూస్తారు. ఎలాగైతే తల్లి తన పిల్లల పై నిస్వార్థంగా ప్రేమ చూపిస్తుందో అలాగే తులసికూడా అనేక రోగాలను నిర్మూలిస్తుంది.

 అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో  నాలుగు తులసి ఆకులు తింటే శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. మరియు మిమ్మల్ని కాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల నుండి కాపాడుకుంది. ఈ జ్యూస్ని రోజూ క్రమంతప్పకుండా ఒకగ్లాసు తాగుతూ ఉంటే రక్తనాళాల్లో బ్లాకేజ్లు తగ్గిపోతాయి. అలాగే డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుంది. హైబీపీ సమస్య తగ్గుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ డ్రింక్ చెడుకొలెస్ట్రాల్ తగ్గించి అధికబరువు సమస్యను దూరం చేస్తుంది. 

జీవన శైలి మార్పులు, బయట ఆహారం తగ్గించి ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకుంటే వేలకు వేలు ఖర్చపెట్టనవసరం లేదు. ఆహారం లో పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకోండి. తక్కువగా ఫ్రై చేసిన ఆహారాలు తీసీకోండి. అలాగే వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి. ఇలాచేయడంవలన శరీరం ఆరోగ్యం గా ఉంటుంది. ఒకరోజు ఉపవాసం ఉండడంవలన  శరీరంలోపల ఉండే కొవ్వును ఉపయోగించుకుంటుంది. మలినాలు, విషవ్యర్థాలను బయటకు పంపించివేస్తుంది. రోజూ క్రమంతప్పకుండా ఈ జ్యూస్ తీసుకుని మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. 

1 thought on “2రోజుల్లో తలనుండి పాదాలవరకూ మూసుకుపోయీన రక్తనాళాలు తెరుచుకుంటాయి.”

Leave a Comment

error: Content is protected !!