Homemade body pack for skin whitening

రెండు నిమిషాల్లో ముఖం తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది

చిన్న చిన్న పార్టీ లేదా ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు పార్లర్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితో అతి తక్కువ ఖర్చు తో ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.  పార్లర్కీ వెళ్లి  గంటల కొద్దీ కూర్చునె అవసరం లేకుండా వేలకు వేలు ఖర్చుపెట్టే  అవసరం లేకుండా కేవలం పది రూపాయల లోనే మీ  ఫేస్ మొత్తం  మెరిసి పోతుంది. ఇది ట్రై చేసిన తర్వాత మీరు ఎటువంటి మేకప్ వేసుకోకపోయినా సరే చాలా అందంగా, తెల్లగా మెరిసిపోతారు.

 ఈ టిప్ కోసం పది రూపాయలు ఫేర్ అండ్ లవ్లీ  తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని  ప్యాకెట్లో సగం ఫేర్ అండ్ లవ్లీ  వేసుకోవాలి. తర్వాత దానిలో ఒక చెంచా పంచదార తీసుకోవాలి.  పంచదార పౌడర్ ను కూడా వేసుకోవచ్చు.  తర్వాత ఒక టమాట మధ్యలో కట్  చేసుకుని రసం మాత్రమే వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక నిముషం పాటు టమోటా ముక్కతో స్క్రబ్  చేయాలి. తర్వాత చేతి తో ఒక ఐదు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి.     తర్వాత ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. మిగిలిన సగం ఫైర్ అండ్ లవ్లీ బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి. కాఫీ పౌడర్ వద్దనుకున్న వాళ్ళు సెనగపిండి వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 5నిముషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ముఖంలో ఇన్స్టంట్ గ్లో వస్తుంది. మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లేదా పార్టీలకి వెళ్లాల్సి వచ్చినపుడు ఈజీగా ఈ చిన్న చిట్కాతో మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది. 

      ఎటువంటి మేకప్ అవసరం లేకుండా మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి చేయించుకున్న ఫేసియల్స్ కంటే ఈ చిన్న టిప్ చాలా బాగా పని చేస్తుంది. మంచి రిజల్ట్ ఉంటుంది.దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పండగలకి, పార్టీకి కానీ వెళ్లే 5 నిముషాల ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎలాగో పండగల సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. 

Leave a Comment

error: Content is protected !!